
సూర్యాపేట :
జిల్లాలో నిర్వహించబోయే గ్రామపంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని సూర్యాపేట జిల్లా ఎన్నికల పరిశీలకులు రవి నాయక్ అధికారులు శుక్రవారం కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ తేజస్ నందాలాల్ పవర్ తో కలిసి గ్రామ పంచాయితీ ఎన్నికల నిర్వహణ పై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ విషయమై రాండమైజేషన్ నిర్వహించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ మొదటి విడత ఎన్నికలు జరిగే ఆత్మకూరు ఎస్, సూర్యాపేట,జాజిరెడ్డిగూడెం, నాగారం, నూతనకల్, మద్దిరాల, తిరుమలగిరి, తుంగతుర్తి మండలాల్లో లోని ఆయా గ్రామ పంచాయతీల సర్పంచ్, వార్డు స్థానాలకు ఎన్నికల పోలింగ్ విధులు నిర్వర్తించే ప్రిసైడింగ్ అధికారులు,ఓ.పీ.ఓలను ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. స్థానికత, విధులు నిర్వర్తిస్తున్న మండలం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని, సిబ్బందికి పోలింగ్ విధులను కేటాయించారు.జిల్లాలో మొదటి విడత లో 159 గ్రామ పంచాయతీల సర్పంచ్, 1442 వార్డు స్థానాలకు ఎన్నికల నిర్వహణ కోసం 20 శాతం రిజర్వ్ సిబ్బంది కలుపుకుని ప్రిసైడింగ్ అధికారులు 1683, ఓ.పీ.ఓలు 2260 పోలింగ్ కోసం ర్యాండమైజేషన్ జరిపారు.ఈ ర్యాండమైజేషన్ ప్రక్రియలో అదనపు కలెక్టర్ కే. సీతారామారావు, జడ్పీ సి ఈ ఓ వి వి అప్పారావు,డీపీఓ యాదగిరి, డి ఎల్ పి ఓ నారాయణ రెడ్డి, అధికారులు,తదితరులు పాల్గొన్నారు