రాక్ టౌన్‌లో హిందూ సమ్మేళన హోరు

ఆధ్యాత్మిక వైభవంతో పులకించిన రాక్ టౌన్ కాలనీ.. సాంస్కృతిక ప్రదర్శనలతో అదరగొట్టిన చిన్నారులు

రాక్ టౌన్‌లో హిందూ సమ్మేళన హోరు

ఎల్బీనగర్, :

హైదరాబాద్‌లోని రాక్ టౌన్ బస్తీ మంగళవారం రాత్రి ఆధ్యాత్మిక శోభతో మెరిసిపోయింది. హిందూ సమ్మేళన మహోత్సవం పేరిట నిర్వహించిన ఈ వేడుక అత్యంత వైభవంగా సాగింది. సుమారు 1200 మందికి పైగా మహిళలు, చిన్నారులు, స్థానికులు తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు

కార్యక్రమంలో భాగంగా చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పురాణ గాథలను ప్రతిబింబించేలా వేసిన నాటికలు, సంప్రదాయ నృత్యాలు, భక్తి పాటలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేలా చిన్నారుల ప్రదర్శనలు సాగాయి.

సంస్కృతి పరిరక్షణ అందరి బాధ్యత:

సమ్మేళనానికి హాజరైన వక్తలు హిందూ ధర్మం, సంప్రదాయాల విశిష్టతను వివరించారు.

 *మల్లంపాటి భారతి (అసోసియేట్ ప్రొఫెసర్) భారతీయ జీవన విధానంలో కౌశలం, సంప్రదాయాల పాత్రను వివరించారు.

 డాక్టర్ భాస్కర యోగి:సాహిత్య ప్రచారం ద్వారా ధర్మాన్ని కాపాడుకోవాల్సిన అవసరాన్ని గుర్తుచేశారు. అనంతానంద భారతి స్వామి హిందూ ధర్మ పరిరక్షణపై అనుగ్రహ భాషణం చేస్తూ భక్తులకు దిశానిర్దేశం చేశారు.

ప్రతిభకు పురస్కారం:
వివిధ పోటీల్లో గెలుపొందిన చిన్నారులకు నిర్వాహకులు బహుమతులు అందజేశారు. అనంతరం కార్యక్రమానికి హాజరైన భక్తులకు అన్నదాన సౌకర్యం కల్పించారు. రిటైర్డ్ తహసీల్దార్ హనుమంతరావు నేతృత్వంలోని నిర్వహక సమితి సభ్యులు సమష్టిగా కృషి చేసి ఈ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ తరహా కార్యక్రమాలు సామాజిక ఐక్యతకు దోహదపడతాయని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.WhatsApp Image 2026-04-15 at 18.39.41 (2)

About The Author