అపసవ్య దిశ వాహన చోదకులపై దృష్టి పెట్టండి..
ఎల్బీనగర్ నగర్ ట్రాఫిక్ డీసీపీని కోరిన కిక్కర గోపీ శంకర్ యాదవ్
ఎల్బీనగర్
సురక్ష సేవా సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిక్కర గోపీ శంకర్ యాదవ్ శుక్రవారం ఎల్బీ నగర్ ట్రాఫిక్ డీసీపీ వరికుప్పల శ్రీనివాస్ ని కలసి పలు ట్రాఫిక్ భద్రతా అంశాలపై మాట్లాడటం జరిగింది. ముఖ్యంగా
రోడ్డు ప్రమాదాలలో ప్రధానంగా అపసవ్య దిశలో వాహనాలు నడిపే వారితోనే ఎక్కువ ప్రమాదం ఉందని, కొన్ని సందర్భాలలో ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉందని.. ఇలాంటి వారిపై ఎక్కువగా దృష్టి పెట్టి తగిన చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది. ఈ సమావేశంలో సురక్ష సేవా సంఘం క్రియాశీలక సభ్యులు పిల్లి. శ్రీనివాస్ యాదవ్, శ్రీపాద. నరసింహ చారి పాల్గొన్నారు.
About The Author
07 Mar 2026
