
కామారెడ్డి జిల్లా :
డిసెంబర్ 01: ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పిడిఎస్యూ కామారెడ్డి 23వ జిల్లా మహాసభలు కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఈనెల 28వ తేదీన నిర్వహించడం జరిగిందని, కామారెడ్డి జిల్లా కేంద్రంలో పిడిఎస్యు బలమైన విద్యార్థి ఉద్యమాలను నిర్మించినందుకు తనను జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి సురేష్ మాట్లాడుతూ, తనపై నమ్మకంతో నియమించినందుకు బాధ్యతతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలంబిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలపై సంక్షేమ హాస్టల్లో నెలకొన్న సమస్యలపై నిరంతరం పోరాటం కొనసాగిస్తామన్నారు. అనంతరం జిల్లా కమిటీ సభ్యులు ఈ బాధ్యత అప్పజెప్పినందుకు హర్షం వ్యక్తం చేశారు.