పాల్సి తండా సర్పంచ్‌గా ఆడే గజేందర్ ఏకగ్రీవ ఎన్నిక.

WhatsApp Image 2025-12-12 at 6.33.33 PM

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యూరో : 

కుబీర్ మండలంలోనిలోని పాల్సి తండా గ్రామానికి చెందిన ఆడే గజేందర్ గ్రామ సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన  ముధోల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, మాజీ శాసన సభ్యులు  భోంస్లే నారాయణ్ రావు పటేల్ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో కుబీర్ మండలం అధ్యక్షుడు బషీర్.బంక బాబు, యువ నాయకులు పురం షెట్టి రవికుమార్ తదితర కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు. గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని సర్పంచ్ ఆడే గజేందర్ ఈ సందర్బంగా తెలిపారు. 

About The Author