హిందువులు బొందు గాళ్లు అన్నోళ్లు కాలగర్భంలో కలిసిపోయారు
సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం
బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి

కరీంనగర్ :
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయాలే పరమావధిగా జీవిస్తున్నారని , తన రాజకీయ అవసరాల కోసం ఇతర మతాల మెప్పుకోసం హిందూ దేవుళ్లను ద్వేషిస్తూ, హేళనగా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి బేషరతుగా హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హిందూ వ్యతిరేక వ్యాఖ్యలపై బుధవారం బిజెపి జిల్లా శాఖ ఆధ్వర్యంలో నగరంలోని తెలంగాణ చౌక్ లో నిరసన కార్యక్రమం చేపట్టి సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం గంగాడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ గత ముఖ్యమంత్రి కేసీఆర్ హిందువులను చులకన చేసి మాట్లాడారని , హిందుగాళ్లు , బొందు గాళ్ల నీ నాడు కెసిఆర్ చేసిన వ్యాఖ్యలకు కాలమే సమాధానం చెప్పిందన్నారు. కెసిఆర్ చేసిన వ్యాఖ్యలకు హిందూ సమాజం తగిన బుద్ధి చెప్పిందని, నేడు ఆ పార్టీ కాలగర్భంలో కలిసిపోయే పరిస్థితి వచ్చిందన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కెసిఆర్ బాటలోనే నడుస్తున్నారని , అందుకే హిందూ సమాజం తో పెట్టుకుంటున్నారని ఘాటుగా విమర్శించారు. మూడు కోట్ల దేవతలంటూ .. ఒక్కో దేవుని పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హిందూ ప్రజల మనోభావాలు దెబ్బ తీసేలా ఉన్నాయన్నారు. హిందూ దేవుళ్ళ గురించి వ్యాఖ్యలు చేసినట్టు ఇతర మతాల దేవుళ్ళ గురించి రేవంత్ రెడ్డికి మాట్లాడే దమ్ము ధైర్యం ఉందా అని ఆయన ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి హిందూ ద్వేషిగా మారారన్నారు. హిందూ దేవుళ్ళతో , హిందూ సమాజంతో పెట్టుకుంటున్న రేవంత్ రెడ్డి గత కెసిఆర్ లాగే కాలగర్భంలో కలిసిపోయే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. ముందుగా కొత్తపల్లి బిజెపి మండల అధ్యక్షుడు కుంట తిరుపతి ఆధ్వర్యంలో ముఖ్య నేతల సమావేశంలో పై వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిల రమేష్,వాసాల రమేష్,కళ్లెం వాసుదేవరెడ్డి, గువ్వల శ్రీనివాస్,కటకంలోకేష్, జోన్ ప్రెసిడెంట్,పాదం శివరాజ్, బండారు గాయత్రి,తణుకు సాయి కృష్ణ, అవదుర్తి శ్రీనివాస్ నరహరి లక్ష్మారెడ్డి, ఆవిడల చైతన్య, నాంపల్లి శ్రీనివాస్, ప్రసన్న, యువ క్రాంతి, అక్షయ్, కట్ట రాజు, ప్రసాద్,బోయిన్ శ్రీను,జి రవి,అనిష్,పాశం తిరుపతి,ఆకుల నరేష్, అజయ్, వెంకటేష్,సందీప్, శ్రీధర్,అనిల్,విజయ్, కలికోట మోహన్,నారాయణ, జిత్తు, నవీన్, తదితరులు పాల్గొన్నారు..
