గ్రామాభివృద్ధికి కృషి చేస్తాను..
గ్రామ సర్పంచ్ అభ్యర్థి జాధవ్ వందన మోహన్ అంతర్నీ హామీ..

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యూరో :
కుబీర్ మండలం అంతర్నీ గ్రామ పంచాయతీకి ఈసారి ఎస్టి మహిళా రిజర్వేషన్ కేటాయించడంతో జాదవ్ వందన మోహన్. సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్నారు. రాజకీయ అనుభవంతో గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని జాదవ్ వందన మోహన్. పేర్కొన్నారు. వ్యవసాయ రైతుల కోసం పొలంబాట రహదారి పనులను ప్రాధాన్యంగా తీసుకుంటానని, అనుబంధ గ్రామాల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా రహదారులు, వంతెనలు నిర్మాణం చేసే దిశగా శ్రమిస్తానని హామీ ఇచ్చారు. వర్షాకాలంలో గర్భిణీలకు కలిగే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని అత్యవసర సేవలకు అనుకూలమైన మౌలిక వసతులు కల్పిస్తామని తెలిపారు. గ్రామంలో డ్రైనేజీలు, పారిశుద్ధ్యం, పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటానని భరోసా ఇచ్చారు. ఓటర్లు అవకాశమివ్వాలని, కత్తెర గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
