
సూర్యపేట :
జిల్లా ప్రతినిధి: శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా మంగళవారం నుండి ఈనెల 31 వరకు 30 పోలీస్ ఆక్ట్ అమల్లో ఉంటుందని జిల్లా ఎస్పీ నరసింహ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో పోలీసు అధికారుల అనుమతులు లేకుండా ఎలాంటి ర్యాలీలు, సమావేశాలు, ఊరేగింపులు, ధర్నాలు, బహిరంగ సభలు, ప్రజలు గుమిగూడి ఉండే విధంగా కార్యక్రమాలు నిర్వహించడానికి సన్నాహాలు చేయరాదని తెలిపారు. అనుమతులు లేకుండ కార్యక్రమాలు నిర్వహింస్తే నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తప్పవని తెలిపారు. ప్రజా జీవనానికి ఇబ్బంది కలిగించేందుకు దారి తీసే సమావేశాలు, జన సమూహం చేయడం పూర్తిగా నిషేధమని తెలిపారు. సోషల్ మీడియా నందు అనవసరమైన విషయాలను, అసత్యాలను వ్యాప్తి చేసిన వారిపై కేసులను నమోదు చేయబడతాయని తెలిపారు. చట్టపరంగా జారీ చేసిన ఆదేశాలను ఎవరైనా ఉల్లంఘించినట్లయితే 30 పోలీస్ ఆక్ట్ ప్రకారం చర్యలు తప్పవు అని తెలిపారు. బాణాసంచా,డిజేలు ఉపయోగించవద్దు అన్నారు