పోలింగ్ ముందు 44 గంటల సైలెన్స్ పీరియడ్ అమలు

- ప్రచార కార్యక్రమాలపై  నిషేధం 
- జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పి.ప్రావీణ్య

WhatsApp Image 2025-12-10 at 5.30.02 PM

సంగారెడ్డి : 

గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ దృష్ట్యా, రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, నియమావళి మేరకు సంబంధిత మండలాల్లో ‘సైలెన్స్ పీరియడ్’ అమల్లోకి వస్తుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్  పి. ప్రావీణ్య తెలిపారు.మొదటి విడత లోగుమ్మడిదల, హత్నూర, కంది, కొండాపూర్, పటాన్చెరు, సదాశివపేట, సంగారెడ్డి మండలాల్లో డిసెంబర్ 09వ తేదీ సాయంత్రం 5:00 గంటల నుండి ప్రచార కార్యకలాపాలపై నిషేధం అమల్లో ఉందని తెలిపారు.రెండవ విడత లో ఆందోల్, చౌటకూర్, ఝరాసంగం, కొహిర్, మొగుడంపల్లి, మునిపల్లి, పుల్కల్, రాయికోడ్, వట్పల్లి, జహీరాబాద్ మండలాల్లో డిసెంబర్ 12వ తేదీ సాయంత్రం 5:00 గంటల నుండి ప్రచార కార్యక్రమాలపై నిషేధం అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు.మూడవ విడతలో కల్హేర్, కంగ్టి, మనూర్, నాగల్ గిద్ద, నారాయణఖేడ్, నిజాంపేట్, సిర్గాపూర్, న్యాల్కల్ మండలాల్లో డిసెంబర్ 15వ తేదీ సాయంత్రం 5:00 గంటల నుండి ప్రచార కార్యక్రమాలు  నిషేధాజ్ఞలు ఉంటాయని తెలిపారు.ఆయా విడతలకు సంబంధించి  44 గంటల సైలెన్స్ పీరియడ్ అమలులో ఉంటుందని, ఈ సమయంలో ఎలాంటి బహిరంగ సమావేశాలు, ఎలక్ట్రానిక్ లేదా ఇతర మీడియా మాధ్యమాల ద్వారా ఎన్నికల ప్రచారం పూర్తిగా నిషేధించబడుతుందని తెలిపారు.జిల్లాలో ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, శాంతియుతంగా సాగేందుకు ప్రజలు, రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, ప్రతినిధులు పూర్తి సహకారం అందించాలని ఆమె కోరారు. 

About The Author