
కామారెడ్డి జిల్లా :
అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవమును పురష్కరించుకుని కలెక్టరేట్ సమావేశ మందిరంలో మహిళలు, పిల్లలు, వికలాంగులు వయోవృద్ధుల సంక్షేమశాఖ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, జిల్లా సివిల్ జడ్జ్ నాగరాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా శుభాకంక్షలు తెలుపుతూ, జిల్లాలో దివ్యాంగుల కొరకు అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు . ప్రతీ సంవత్సరం డిసెంబర్ 3న ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. దివ్యాంగుల హక్కులు, గౌరవం, సమానత్వం సామాజిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం కొరకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు. జిల్లాలోని దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలైన నెలసరి పింఛన్లు, సహాయక పరికరాలు, కృత్రిమ అవయవాలు, నైపుణ్యాభివృద్ధి శిక్షణలు, స్వయం ఉపాధి రుణాలు, ప్రత్యేక విద్యా సదుపాయాలు వంటి కార్యక్రమాలు ద్వారా లబ్దిపొందుతున్నారన్నారు.
దివ్యాంగులు ప్రతిభ, కష్టపడి పనిచేయగల శక్తి, సంకల్పబలం ద్వారా సమాజంలో అనేక రంగాలలో రాణిస్తున్నారని ఆయన అభినందించారు. జిల్లాలో ఈ సంవత్సరంలో వికలాంగులకు 68 స్కూటీ లు, లాప్ టాప్స్- 8 స్మార్ట్ ఫోన్స్-3 బ్యాటరి ట్రై సైకల్-12 మిని ట్రేడింగ్ ఆటో-2 హైబ్రిడ్ వీల్ చైర్-2 మొదలగు వాటి ప్రతిపాదనకు డైరెక్టర్ పంపడం జరిగిందని వికలాంగులకు ఆర్ధిక పునరావాసం కొరకు 28 మందికి లోన్స్ మంజూరు చేయడం జరిగింది.అదే విధంగా వికలాంగులను పెళ్లి చేసుకున్న వారికి ఆవార్డు కింద 15 మందికి 15 లక్షలు మంజురు, ప్రజావాణికి వచ్చే వికలాంగులకు మొదటి ప్రాధాన్యత ఇస్తునట్లు వారికి ప్రత్యేక క్యూ లేకుండా డైరెక్ట్ గా ఫిర్యాదులు తీసుకుంటారని తెలియజేసారు. అదే విధంగా యుడిఐడి కార్డుల పంపిణిలో కామారెడ్డి జిల్లా మొదటి స్థానంలో ఉందని గుర్తుచేసారు.
అంతర్జాతీయ దివ్యంగుల దినోత్సవంలో భాగంగా వికలాంగులకు ఆటల పోటీలలో గెలుపొందిన విజేతలకు కలెక్టర్ చేతులమీదుగా బహుమతులను ప్రాధానం చేసారు. అదే విధంగా డ్వాక్రా గ్రూపు ద్వారా ఆర్ధిక సహాయం పొంది లోన్ ను త్వరితగతిన పూర్తిచేసిన గ్రూప్ సభ్యులకు సన్మానించారు.
దివ్యాంగులు ఆత్మగౌరవంతో, స్వయం ఆధారితంగా జీవించే సమాజ నిర్మాణమే మన లక్ష్యమన్నారు. అందరి సహకారంతో దివ్యాంగుల అభ్యున్నతి కోసం మరింత కృషి చేస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి ప్రమీల, జిల్లా గ్రామీణభివృది ఆధికారి సురేందర్, అధికారులు వికలాంగుల సంఘాల నాయకులూ సాయిలు, పోచవ్వ హరిసింగ్, బాలరాజ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.