నీటిపారుదలశాఖ రాష్ట్ర ఆడహక్ కమిటీ కన్వీనర్ సంగెం

టీఎన్జీవో జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఘన సన్మానం

WhatsApp Image 2025-12-09 at 6.01.54 PM

కరీంనగర్ : 

Read More కాంగ్రెస్ లో చేరిన ఉటూరు బీఆర్ఎస్ నేతలు

టీఎన్జీవోల కరీంనగర్ జిల్లా కార్యదర్శి, ఆ శాఖ సూపరిండెంట్ సంగేం లక్ష్మణరావు నీటిపారుదల శాఖ రాష్ట్ర అడ హక్ కమిటీ కన్వీనర్‌గా నియమితులయ్యారు. మంగళవారం పదవిని స్వీకరించిన సందర్భంగా టీఎన్జీవో జిల్లా శాఖ అధ్యక్షులు దారం శ్రీనివాస్ రెడ్డి  ఆధ్వర్యంలో ఘన సన్మానించారీ. సంఘం నాయకులు, ఉద్యోగులు  సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం జిల్లా అధ్యక్షులు  మాట్లాడుతూ కరీంనగర్ జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి నేతలుగా ఎదిగి బాధ్యతలు చేపట్టడం టీఎన్జీవో సంఘానికి గర్వకారణమన్నారు. వ్యవస్థాపక అధ్యక్షులు మారం జగదీశ్వర్ గతంలో ఇరిగేషన్ శాఖ రాష్ట్ర అధ్యక్షులుగా, నాయకత్వం స్థానంలో కరీంనగర్ జిల్లా కార్యదర్శి శ్రీ సంగేం లక్ష్మణరావుకు అవకాశం దక్కడం కరీంనగర్ జిల్లాకు ప్రత్యేకత సంతరించుకుందన్నారు. ఆయన క్రమశిక్షణ, సంఘనిబద్ధత, నిరహంకార వైఖరి, ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో చూపిన నిజాయితీ, కృషి వంటి లక్షణాలు ఆయనను ఈ పదవికి అర్హుడిగా నిలబెట్టాయని తెలిపారు. రాష్ట్ర కన్వీనర్‌గా ఆయన భవిష్యత్తులో మరెన్నో ఉన్నత స్థానాలకు ఎదగాలని జిల్లా టీఎన్జీవో శాఖ తరఫున అభిలషించారు. అలాగే, ఈ నియామకానికి కీలకంగా సహకరించిన రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వర్, రాష్ట్ర కార్యదర్శి ముజీబ్ హుస్సేన్ లకు కరీంనగర్ జిల్లా టీఎన్జీవో సంఘం కృతజ్ఞతలు తెలియజేసింది. సంఘం అభివృద్ధిలో జిల్లా నాయకత్వం, ఉద్యోగుల ఐక్యత కీలకమని ఆయన అన్నారు. కరీంనగర్ జిల్లా ఉద్యమకారులకు, నాయకులకు పుట్టినిల్లు, నాయకులను తయారు చేసే కర్మశాల లాంటిదని. ఈ నేల నుండి రాష్ట్ర స్థాయి నాయకులు వెలుగు చూడటం సహజంమని తెలియజేశారు.

Read More కాంగ్రెస్ పార్టీకి కామారెడ్డి ప్రజలు స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారు..

ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు రాగి శ్రీనివాస్, గూడ ప్రభాకర్ రెడ్డి, గేజిటేడ్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షులు మడిపల్లి కాళీ చరణ్ గౌడ్, కార్యదర్శి ఎడ్ల అరవింద్ రెడ్డి, టీఎన్జీవోల సంఘం కోశాధికారి కిరణ్ కుమార్ రెడ్డి, అసోసియేట్ అధ్యక్షులు ఓంటేల రవీందర్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు మారుపాక రాజేష్ భరద్వాజ్, మహిళా నాయకులు ఇరుమల్ల శారద, సునీత, నాయకులు రమేష్ గౌడ్, ప్రసాద్ రెడ్డి, పోలు కిషన్, నాగరాజు, కోమ్మేర శ్రీనివాస్ రెడ్డి, కామ సతీష్ పటేల్, లవ కుమార్, వెలిచాలా శ్రీనివాసరావు, కరుణాకర్, అజ్గార్ అలీ, శంకర్, జగన్ గౌడ్, కమలాకర్, శంషుద్దీన్, నారాయణ, పూర్ణచందర్, రాజయ్య, విక్రమ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు 

Read More పీజీ మూడో సెమిస్టర్ పరీక్ష వాయిదా వేయాలి

About The Author