టి జి ఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నమనేని జగన్ మోహన్ రావు ను ఏకగ్రీవంగా ఎన్నుకోవాలి

ఉమ్మడి వరంగల్ బ్యూరో:
అనంతరం క్రింది తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు.
డిసెంబర్ 31 న ఖాళీ కాబోతున్న టీజీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవికి టీజీవో అసోసియేషన్ ఏర్పడినప్పటి నుండి సంఘాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ముఖ్యపాత్ర పోషించి, అనేక శాఖల అధికారుల సమస్యలను రాష్ట్రస్థాయిలో పరిష్కరించేవిధంగా చొరవ చూపిన నాయకుడిగా, ఉమ్మడి వరంగల్ జిల్లా కోఆర్డినేటర్ గా ఉండి ఆరు జిల్లాల శాఖలను క్రియాశీలకంగా ఉంచి రెండు జిల్లాలలో అసోసియేషన్ కు ప్రభుత్వ భూమిని కేటాయింపచేసి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రాష్ట్రంలోనే మొదటి టీజీవో భవనాన్ని రూ. 80 లక్షల నిధులతో నిర్మించిన వ్యక్తిగా రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్నమనేని జగన్ మోహన్ రావు ని టీజీవో కేంద్ర సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవికి సముచితమైన వారిగా భావించి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవలసిందిగా కోరుతూ తీర్మానించనైనది. ఈ విషయమై రాష్ట్ర అధ్యక్షుల వారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడంలో చొరవ చూపవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ తీర్మానించనైనది. లేనిపక్షంలో అసోసియేషన్ బైలా ప్రకారం ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నిక నిర్వహించవలసినదిగా తీర్మానించనైనది.. .
ఇతర తీర్మానాలు :
1. ఉద్యోగుల పెండింగ్ బిల్స్ అన్నింటిని వెంటనే ప్రభుత్వం చెల్లించాలి. బకాయిపడిన డి.ఏ. లను మంజూరు చేసి నూతన పి.ఆర్.సీ ని ప్రకటించాలి.
2. శాఖల వారీగా ఉన్న వివిధ ఆర్థికేతర సమస్యలు ముఖ్యంగా క్యాడర్ స్ట్రెంత్ లను సవరించి దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న ప్రమోషన్ సమస్యలను పరిష్కరించాలి.
3. ఉద్యోగులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల సాధనకు టీజీవో కేంద్ర సంఘం తీసుకునే అన్ని కార్యక్రమాలకు సంపూర్ణ మద్దతునిస్తూ కేంద్ర నాయకత్వం ప్రకటించే కార్యాచరణలో జిల్లాలోని అధికారులందరూ పెద్ద ఎత్తున పాల్గొనాలని తీర్మానించడమైయినది.
4. 2025 సంవత్సరానికి గాను అసోసియేషన్ సభ్యత్వ నమోదు ప్రక్రియను 100% పూర్తి చేయాలని తీర్మానించడమైయినది.
5. టీజీవో డైరీ 2026 కొరకు ప్రతీ కార్యవర్గ సభ్యులు డేటా , ప్రకటనల సేకరణను డిసెంబర్ 5 వరకు పూర్తి చేయాలని తీర్మానించడమైనది.
6. గెజిటెడ్ అధికారులకు ఇళ్ల స్థలాలను కేటాయించాలని తీర్మానించడమైనది.
ఈ సమావేశంలో సహాధ్యక్షులు పి. వెంకటేశ్వర్ రావు, కార్యదర్శి డాక్టర్ ప్రవీణ్ కుమార్, కోశాధికారి పి. రాజేష్ కుమార్, మాధవి, సురేష్ కుమార్, శ్రీనివాసరావు, డా|| మహేష్ కుమార్, మాధవ రెడ్డి, వాసం శ్రీనివాస్, రమేష్, సంతోష్ కుమార్, డా|| విక్రం, రాజేశ్వర్ కుమార్, రవీంద్ర, ఆంజనేయులు పాల్గొన్నారు.
