పకృతి వ్యవసాయంపై కిసాన్ మేళా

పాల్గొన్న జిల్లా వ్యవసాయ అధికారి- శ్రీధర్ రెడ్డి

WhatsApp Image 2025-12-05 at 5.33.57 PM

సూర్యాపేట : 
కృషి విజ్ఞాన కేంద్రం గడ్డిపల్లి లో  శుక్రవారం నాడు నిర్వహించిన ప్రపంచ మృత్తిక దినోత్సవ కార్యక్రమంలో భాగంగా  ప్రకృతి వ్యవసాయంపై కిసాన్ మేళాను ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి సూర్యాపేట జిల్లా వ్యవసాయ అధికారి జి శ్రీధర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారని కే.వి.కే సీనియర్ సైంటిస్ట్ అండ్ హెడ్ ఇన్చార్జ్ డి. నరేశ్ .ఈ కార్యక్రమాన్ని మొదటగా వ్యవసాయ ప్రదర్శనను.జి. శ్రీధర్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.తర్వాత ప్రదర్శనలో ఏర్పాటు చేసిన డెమోస్ అని చూసి రైతులకు ఉపయోగపడే ప్రకృతి వ్యవసాయాన్ని  తిలకించారు.వారు  మాట్లాడుతూ నేలను (మట్టి) పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకతపై ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు అన్నారు.ఆరోగ్యకరమైన నేలలు ఆరోగ్యకరమైన నగరాలకు పునాది, భవిష్యత్ నాంది అన్నారు. రైతులు సేంద్రియ ఎరువులు జీవ సంబంధ పురుగు మందులు పచ్చిరొట్ట, జీవన ఎరువులు ఉపయోగించాలి.  సమగ్ర వ్యవసాయ పద్ధతులను పాటించి నేల కోతను అరికట్టాలి. నీటి వినియోగాన్ని సమర్థవంతంగా చేపట్టాలి. భూసార పరీక్షల ఫలితాల ఆధారంగా ఎరువులు వాడాలి.  నేలను కప్పి ఉంచే పద్ధతిని అనుసరించాలి. పంట మార్పిడి, అంతరపంటలు, సాగు విధానాల కొనసాగింపుతో నేత కోతను అరికట్టవచ్చు అనిరసాయనక ఎరువుల వాడకాన్ని తగ్గించి సేంద్రియ ఎరువులు వాడాలని సూచించారు.ఈ కార్యక్రమంలో  కే.వి.కే సీనియర్ సైంటిస్ట్ అండ్ హెడ్ ఇన్చార్జ్ శ్రీ డి. నరేశ్ మాట్లాడుతూ రైతులు కేవలం ఒకే రకమైన పంటలు వేసుకోకుండా సమగ్ర వ్యవసాయ విధానాలను పాటిస్తూ అధిక దిగుబడులను సాధించవచ్చని తెలిపారు.  నేల సారవంతం తగ్గడానికి గల కారణాలు, నేల ఆరోగ్య  పరిరక్షణకు పాటించవలసిన పద్ధతుల గురించి తెలిపారు. అలాగే సమగ్ర పోషక యాజమాన్య పద్ధతులు అవలంబిస్తూ నేల ఆరోగ్యన్ని కాపాడుకోవాలి సూచించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారితో నేల పరిరక్షణకై ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో  భాగంగా రైతులకు భూసార ఆరోగ్య పత్రాలను పంపిణీ చేయడం జరిగింది. అలాగే సేంద్రియ వ్యవసాయం చేసే రైతులకు సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి జి. శ్రీధర్ రెడ్డి, కే.వి.కే శాస్త్రవేత్తలు డీ.నరేష్, సి.హేచ్. నరేష్,  ఎ.కిరణ్, పి.అక్షిత్ సాయి, యన్ సుగంధి, నూతనకల్ మండల వ్యవసాయ అధికారి కే .మల్లారెడ్డి, కంప్యూటర్ ప్రోగ్రామర్ ఏ. నరేశ్, సూపర్డెంట్ ఉపేందర్, స్టెనో ఎం.సైదులు ఇఫ్కో జిల్లా మేనేజర్ ఏ. వెంకటేశ్, రైతులు మరియు  వ్యవసాయ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు...

Read More రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను పరిశీలించిన ఐటీ మంత్రి, అధికారులు

About The Author