రేణుకా చౌదరి పర్యటనను జయప్రదం చేయండి.
- కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు గురజాల గోపి పిలుపు

మణుగూరు :
మాజీ కేంద్రమంత్రి రాజ్యసభ సభ్యురాలు గారపాటి రేణుక చౌదరి పర్యటనను జయప్రదం చేయాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు గురిజాల గోపి పిలుపునిచ్చారు. ముందుగా రేణుక చౌదరి క్యాంపు కార్యాలయం నుండి అంబేద్కర్ సెంటర్ వరకు కార్యకర్తలతో ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సోమవారం రేణుక చౌదరి క్యాంపు కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గోపి మాట్లాడుతూ.. మరో పది రోజుల్లో ఫైర్ బ్రాండ్ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి పినపాక నియోజకవర్గంలో పర్యటన ఉంటుందని తెలిపారు. నియోజకవర్గంలో జరిగే పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఫైర్ బ్రాండ్ పాల్గొంటారని ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొనీ విజయవంతం చేయాలని కోరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులుగా నియామకమైన తోట దేవి ప్రసన్నకు హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కష్టపడుతూ నిధులు వరదలా తీసుకు వస్తున్నారని కొనియాడారు. అభివృద్ధి పదంలో నడిపించేందుకు ఎమ్మెల్యే చేస్తున్న కృషికి, ఎంపీ బలరాం నాయక్ నిధులు తోడవడం వలన మణుగూరుకి ఈఎస్ఐ హాస్పిటల్ రావడం అభినందనీయమన్నారు. రాజ్యసభ సభ్యురాలు రేణుక చౌదరి పర్యటన అనంతరం ఎంపీ బలరాం నాయక్ పర్యటన ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రేణుక అక్షర మహిళా మండల అధ్యక్షురాలు పూనెం సరోజ, మహిళా సీనియర్ నాయకులు ఎండి షబానా, ఉపాధ్యక్షురాలు బొడ్డు సౌజన్య, రెడ్డిబోయిన రేణుక, డేరంగుల సుజాత, కన్నాపురం వసంత, డాకూరి సౌజన్య, బాడిస పార్వతి, సీనియర్ నాయకులు ఎండి షరీఫ్, పింగళి మాధవరెడ్డి, చారి, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
