ఎన్నికల నియమాలను పాటించాలి : లోకేశ్వరం ఎస్.ఐ. అశోక్.
- సంబంధిత ఆసుపత్రిపై చట్టపరమైన చర్యలు
- పోలింగ్ కేంద్రాల 100 మీటర్ల, 200 మీటర్ల వద్ద 144 సెక్షన్ అమలు, ప్రజల గుమి గూడి ఉండరాదు.
- సెల్ ఫోన్లు, వాటర్ బాటిల్స్, ఇంకు బాటిల్స్, పోలింగ్ కేంద్రాన్ని లోనికి అనుమతి లేదు.
- పోలింగ్ కేంద్రాల వద్ద క్యూ లైన్ పద్ధతిని పాటించాలి.
- రెచ్చగొట్టే వాక్యలు, సోషల్ మీడియాలో గొడవలకు దారి తీసేలా పోస్టులు చేసిన వారిపై పోలీసు చర్యలు తప్పవు.

ఎన్నికల తర్వాత అదే రోజు విజయోత్సవ ర్యాలీలు చేయరాదు, సంబంధిత అధికారుల అనుమతితో నిర్ధారించిన రోజు నిర్వహించుకోవాలి. విజయ అనంతరం అదే రోజు టపాకాయలు పేల్చరాదు. గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా మండలంలో జరిగే ప్రతి ఒక్క గ్రామంలో పోలీసు లు సూచించిన నియమాలను పాటించాలని లోకేశ్వరం SI అశోక్ తెలిపారు. పంచాయతీ ఎన్నికల ను ప్రశాంత వాతావరణంలో మరియు నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు ప్రజలు ప్రతి ఒక్కరు సహకరించాలని తెలిపారు. ప్రజలు ప్రతి ఒక్కరూ నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.
పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని 100 మీటర్ల వద్ద 200 మీటర్ల వద్ద ప్రత్యేక నియమ నిబంధనలు ఉంటాయని వాటిని పాటించాలని, ప్రజల అనవసరంగా గుమిగూడి ఉండరాదని తెలిపారు. పోలింగ్ కేంద్రాలలోనికి సెల్ఫోన్లు, వాటర్ బాటిల్ లు, ఇంకు బాటిల్లు, ఆయుధాలు, పెన్నులు, అగ్నికి సంబంధించిన వాటికి అనుమతులు ఉండవని తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద క్యూ లైన్ పద్ధతిని పాటించి పోలీసులకు సహకరించాలన్నారు. పోలింగ్ రోజు ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ కేంద్రాలలోనికి అనుమతి ఇస్తారని తెలిపారు. వాట్సాప్ నందు సోషల్ మీడియా నందు ఇతరులకు రెచ్చగొట్టేలా కించపరిచేలా పోస్టులు పెట్టిన వారిపై పోలీసు నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఎలాంటి సమాచారం అయినా డయల్ 100 ద్వారా పోలీసులకు తెలియజేయాలని, గొడవలకు, అల్లర్లకు పాల్పడకూడదు . ఎన్నికలు పూర్తయిన తర్వాత విజయోత్సవ ర్యాలీలు నిర్వహించరాదని, అధికారుల అనుమతితో నిర్ధారించిన రోజులలో అనుమతి తీసుకుని నిర్వహించుకోవాలి. విజయోత్సవ ర్యాలీలలో టపాకాయలు పేల్చరాదు. సున్నితమైన ప్రాంతాలలో ఫ్లాగ్ మార్చ్ లు నిర్వహిస్తూ ప్రజలలో పోలీసుల పట్ల ధైర్యం నమ్మకం పెంపొందించేందుకు కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు పూర్తి చేయడానికి జిల్లా పోలీస్ యంత్రాంగం కఠినమైన చర్యలతో విధులను నిర్వర్తిస్తుందని తెలిపారు.
