ఎస్పీని కలిసిన రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు

ములుగు జిల్లా :
జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ సుధీర్ రామ్ నాథ్ కేకన్ ను బుధవారం ములుగు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ..గత మహా మేడారం జాతరలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో చేసిన సేవా కార్యక్రమాలు బాగున్నాయని అభినందించారు.గతంలో ఓకే చోట మంచినీటి పంపిణీ జరిగిందని,రానున్న మేడారం మహాజాతరలో రెడ్ క్రాస్ సేవలు మరింత విస్తృతంగా చేస్తూ రెండు మూడు చోట్ల మినరల్ వాటర్ కేంద్రాలు ఏర్పాటు చేసి సేవలందించాలని కోరారు. ఎస్పీ అభినందిస్తూ మీరు చేసే ఉచిత మినరల్ వాటర్ పంపిణీ కేంద్రాలకు తగిన ఏర్పాట్లుచేస్తామని తెలిపారు. అనంతరం రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు మాట్లాడుతూ..రెడ్ క్రాస్ సొసైటీ ములుగు ఆధ్వర్యంలో గత మేడారం జాతరలో ఉచిత మినరల్ వాటర్ పంపిణీ చేయడం జరిగిందని,రానున్న మహా జాతరలో రెండు లేదా మూడు చోట్ల భక్తులకు మినరల్ వాటర్ పంపిణీ చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ములుగు వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీనివాస్ సెక్రటరీ చుంచు రమేష్,పాలక మండలి సీనియర్ సభ్యుడు కొట్టె రాజి రెడ్డి,సారయ్య తదితరులు పాల్గొన్నారు.
