
సంగారెడ్డి :
సంగారెడ్డి పట్టణ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే చింత ప్రభాకర్ చేతులమీదుగా లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. 20 లక్షల 33 వేల విలువైన సీఎం సహాయనిధి చెక్కులను కంది కొండాపూర్ మండలాలకు చెందిన లబ్ధిదారులకు ప్రభుత్వం ద్వారా మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే చింత ప్రభాకర్ చేతుల మీదుగా అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వం భూములను లాక్కోవడం తప్ప అభివృద్ధిని విస్మరించిందన్నారు. రెండు సంవత్సరాలు ప్రభుత్వ పాలన లో మున్సిపాలిటీలు గ్రామాలలో నయా పైస అభివృద్ధి జరగలేదన్నారు. కాంగ్రెస్ నాయకుల స్టేట్మెంట్లు మాత్రం ఉన్నాయే తప్ప పైసా పనిలేదని విమర్శించారు. శంకుస్థాపనలకే పరిమితమై పనులు ప్రారంభించడం లేదని ఎద్దేవా చేశారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ని బొంద పెట్టడం కోసం ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. మహిళలకు 2500 లేవు స్కూటీలు లేవు తులం బంగారం లేదు పెన్షన్ పెంచలే రైతుబంధు సక్రమంగా లేదని ప్రభుత్వాన్ని విమర్శించారు. చీరల నాణ్యత పంపిణీ విధానం అర్హుల ఎంపికలో జరిగిన లోపాలను ప్రజలు అంతా గమనిస్తున్నారని వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్కు తగిన బుద్ధి చెబుతారని ఆయన అన్నారు. కార్యక్రమంలో లబ్ధిదారులు నాయకులు పాల్గొన్నారు.