

సంగారెడ్డి :
సంగారెడ్డి పట్టణంలో బైపాస్ లో కోమల్ జనని మల్టీస్పెషల్ హాస్పిటల్ ని స్థానిక ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ప్రారంభించారు.అధునాతన వైద్య సదుపాయాలతో, అన్ని విభాగాల్లో నైపుణ్యం కలిగిన వైద్య బృందంతో ఈ ఆసుపత్రి ఏర్పాటు చేసినట్లు జనని ఆసుపత్రి యాజమాన్యం ఎమ్మెల్యే కి వివరించారు.ప్రభుత్వ ఆసుపత్రిలతో పాటు ప్రైవేట్ రంగ ఆసుపత్రిలు కూడా ఆరోగ్య సేవల విస్తరణలో కీలక పాత్ర పోషిస్తుందని ఎమ్మెల్యే అన్నారు.స్థానిక ప్రజలకు మెరుగైన చికిత్స అందుబాటులోకి రావడం శుభ పరిమాణం అన్నారు. నిర్వాహకులు ఎమ్మెల్యే కు పుష్ప గుచ్చంతో స్వాగతం పలికి,శాలువాతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ బొంగుల విజయలక్ష్మి రవి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గోవర్ధన్ నాయక్, రాకేష్, నాయకులు జీవీ శ్రీనివాస్ ,అఖిల్ తదితరులు ఉన్నారు.