మాతృదేవోభవ అనాథ శరణాలయానికి విరాళం అందించిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి

WhatsApp Image 2025-12-02 at 6.43.38 PM

బడంగ్ పేట్ : 

Read More పంచాయితీ ఎన్నికల్లో గంపగుత్త బేరాలు..!

మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి నాదర్గుల్ గ్రామంలో నిర్మాణాధీనంగా ఉన్న మాతృదేవోభవ అనాధ శరణాలయం భూమిపూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే, మాజీ మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. అనాథలు, మతిస్థిమితం లేని వారు అభాగ్యుల సేవార్థం నిర్మిస్తున్న ఈ శరణాలయం నిర్మాణానికి గాను ఆమె 3 లక్షల రూపాయల చెక్కును మాతృదేవోభవ గట్టు గిరికి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ, ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజానికి ఎంతో అవసరమని, శరణాలయం త్వరితగతిన పూర్తికావాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఎల్చాలా సుదర్శన్ రెడ్డి, మర్రి నరసింహారెడ్డి, ఇంద్రవెల్లి యాదయ్య, కోటగిరి జంగయ్య, శ్రీరాములు ముదిరాజ్, నరేష్ చారి, విజయ్, సుధాకర్ యాదవ్, పెంటయ్య, బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ రామిడి రామిరెడ్డి, సూర్ణగంటి అర్జున్, పెద్దబావి ఆనంద్ రెడ్డి, ఏనుగు రామిరెడ్డి, పెద్దబావి శ్రీనివాస్ రెడ్డి, తోట జంగారెడ్డి, దండు యాదయ్య, పెద్దబావి మహేందర్ రెడ్డి, సునీత బాలరాజ్, మదారి రమేష్, పోరెడ్డి ప్రభాకర్ రెడ్డి తదితర మాజీ ప్రజా ప్రతినిధులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. 

Read More పి డి ఎస్ యూ జిల్లా ఉపాధ్యక్షుడిగా బి. రాకేష్

About The Author