రైతు వేదిక, స్మశాన వాటిక నిధులన్నీ మోదీ ఇచ్చినవే..
- గ్రామాల అభివ్రుద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది ‘‘గాడిద గుడ్డు’’
- బీజేపీ బలపర్చిన అభ్యర్థులకే ఓటేసి గెలిపించండి
- ఓటేసే ముందు ఒక్కసారి ఆలోచించండి
- గ్రామీణ ఓటర్లకు కేంద్ర మంత్రి బండి సంజయ్ పిలుపు

కరీంనగర్ :
గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో ఓటేసే ముందు ఒక్క క్షణం ఆలోచించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రజలకు విజ్ఝప్తి చేశారు. పల్లె ప్రగతికి పాటుపడుతోంది... పైసలిస్తోంది మోదీ ప్రభుత్వమేనని, గ్రామాల్లో జరిగిన, జరుగుతున్న అభివ్రుద్ధి పనులన్నీ కేంద్ర నిధులతో చేపట్టినవేనని స్పష్టం చేశారు. రైతు వేదిక నుండి స్మశాన వాటిక దాకా, రోడ్ల నిర్మాణం మొదలు వీధి దీపాల దాకా ఆఖరికి గ్రామాల్లో జరిగే పారిశుధ్య పనులకు సైతం కేంద్ర నిధులే వెచ్చిస్తున్నారని తెలిపారు. గ్రామాల అభివ్రుద్ధికి గత 2 ఏళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది ‘‘గాడిద గుడ్డు’’ మాత్రమేనని విమర్శించారు. పచ్చని పల్లెలలకు పైసా ఇయ్యకుండా, చేసిన పనులకు బిల్లులియ్యకుండా సర్పంచులు ఆత్మహత్య చేసుకునే దుస్థితికి తెచ్చింది బీఆర్ఎస్సేనని పేర్కొన్నారు. గ్రామాల అభివ్రుద్ధికి పైసలిస్తున్న బీజేపీ బలపర్చిన అభ్యర్థులకే ఓటేసి గెలిపించి గ్రామాలను అన్ని విధాలుగా అభివ్రుద్ధి చేసుకుని ఆదర్శంగా తీర్చిదిద్దుకునే అవకాశం కల్పించాలని విజ్ఝప్తి చేశారు. పచ్చని పల్లెలకు పైసా ఇయ్యకుండా చిచ్చు పెడుతున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు బుద్ది చెప్పాలంటే... ఆ పార్టీలు బలపర్చిన అభ్యర్థులను ఓడించాలని పిలుపునిచ్చారు. ‘‘దేశాభివృద్ధికి గ్రామాలే మూల స్తంభాలు. గ్రామాలను అభివృద్ధి చేస్తేనే ఈ దేశం అభివృద్ధి చెందుతుందని నమ్మి మనస్పూర్తిగా ఆచరిస్తున్న మహానేత మన ప్రియతమ ప్రధాని నరేంద్రమోదీని బలపర్చి వికసిత్ భారత్ లక్ష్యాల్లో భాగస్వాములు కావాలని కోరారు. మరికొన్ని గంటల్లో పంచాయతీ ఎన్నికల తొలి దశ పోలింగ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని గ్రామాల అభివ్రుద్ధికి కేంద్రం ఇచ్చిన నిధులతోపాటు తాను క్రుషిని వివరిస్తూ మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. ముఖ్యాంశాలు...
రైతు వేదిక నిర్మాణానికి రూ.10 లక్షలు ఇచ్చింది.
పల్లె ప్రక్రుతి వనానికి రూ. 4 లక్షల 23 వేలు ఖర్చు చేసింది.
స్మశాన వాటిక నిర్మాణానికి రూ.11 లక్షల 13 వేలు చెల్లించింది.
డంపింగ్ యార్డ్ నిర్మాణానికి రూ.2 లక్షల 50 వేలు ఇచ్చింది.
నర్సరీల కు రూ.1 లక్షా 56 వేలు ఇచ్చింది.
ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి రూ.12 లక్షలు చెల్లించింది.
ఇంటింటికీ మరుగుదొడ్డి కోసం... రూ.12 వేలు ఇచ్చింది.
ప్రభుత్వం పేదలకు కట్టించే ప్రతి ఇంటికి రూ.1 లక్షల 20 వేలు మోదీ ప్రభుత్వమే ఇస్తోంది.
ప్రతి రైతుకు ఎరువుల సబ్సిడీ పేరిట ఒక్కో ఎకరానికి రూ.18 వేల 600ల సబ్సిడీ ఇస్తోంది.
రేషన్ కార్డు ద్వారా ప్రతి ఏటా రూ.8 వేల విలువ చేసే బియ్యాన్ని ఉచితంగా అందిస్తోంది.
పేదలకు రూ.2వేల 800 ల విలువ చేసే గ్యాస్ కనెక్షన్ ను ఫ్రీగా ఇవ్వడంతోపాటు ప్రతి సిలిండర్ పై రూ.200 సబ్సిడీ ఇస్తోంది.
మన ఊరిలో వెలిగే వీధి దీపాల, హైమాస్ట్ లైట్ల పైసలు కేంద్రమే ఇస్తోంది.
ఉపాధి హామీ పథకం ద్వారా 100 రోజులు పని కల్పిస్తూ కనీస వేతనాలను చెల్లిస్తూ ప్రతి పేదవాడిని ఆదుకుంటోంది మోదీ ప్రభుత్వమే.
మన ఊరిలో ప్రధానమంత్రి సడక్ యోజన, సీఐఆర్ఎఫ్ ద్వారా రోడ్లను నిర్మిస్తోంది మోదీ ప్రభుత్వమే
మన ఊరిలో ప్రతి పేదవాడికి నయాపైసా ఖర్చు లేకుండా బ్యాంక్ అకౌంట్ ను ఓపెన్ చేయించి బ్రోకర్ల ప్రమేయం లేకుండా సంక్షేమ పథకాల నగదును జమ చేస్తోంది మోదీ ప్రభుత్వమే
జాతీయ రహదారుల నిర్మాణానికి వేల కోట్ల నిధులు ఖర్చు చేస్తోంది మోదీ ప్రభుత్వమే...
అన్ని గ్రామపంచాయతీ భవనాలకు నిధులిచ్చింది కేంద్రమే.
అంగన్వాడి కేంద్రాలకు నిధులిస్తోంది కేంద్రమే.
ప్రాధమిక ఆరోగ్య కేంద్ర భవనాల నిర్మాణం, పల్లె దవఖానాల నిర్మాణ నిధులు కూడా కేంద్రానివే.
కరీంనగర్ నుండి వరంగల్ NH563 - 4 లేన్ల రోడ్డు విస్తరణ పనులు 2146.86 కోట్లు....శరవేగంగా పనులు కొనసాగుతున్నాయి. వచ్చే ఏడాది రోడ్డు నిర్మాణ పనులు పూర్తై ప్రజలకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది.
ఎల్కతుర్తి నుండి సిద్దిపేట (NH-765DG) రోడ్డు విస్తరణ పనులు 578 కోట్లు... త్వరలోనే ఈ రోడ్డు పనులు పూర్తి కావొస్తున్నాయి. వచ్చే ఏడాదిలో ఈ రోడ్డు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాబోతోంది.
కరీంనగర్ నుండి జగిత్యాల NH563 - 4 లేన్ల రోడ్డు విస్తరణ పనులు 1900 Cr....భూసేకరణ, కోర్టు కేసులు, చిక్కు ముడులన్నీ అధిగమించాం. కొద్దిరోజుల్లోనే టెండర్ ప్రక్రియను పూర్తి చేసి పనులను ప్రారంభించబోతున్నాం.
సెంట్రల్ రోడ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ద్వారా రోడ్ల నిర్మాణానికి తెచ్చిన నిధులివే :
కేంద్ర రహదారుల మౌలిక సదుపాయాల కల్పన నిధి (CRIF) కింద పార్లమెంట్ పరిధిలోని కరీంనగర్, హుస్నాబాద్, హుజూరాబాద్, మానకొండూరు, సిరిసిల్ల, వేములవాడ, చొప్పదండి నియోజకవర్గాల్లోని పలు మండలాలకు అనుసంధానంగా రూ.219.5 కోట్లతో 150.7 కిలోమీటర్ల పొడవుతో 12 రోడ్డు పనులు చేపట్టినం. మారుమూల గ్రామాలకు సైతం రోడ్లు, బ్రిడ్జీల నిర్మాణం కోసం ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకం ద్వారా 23 మండలాల్లోని మారుమూల గ్రామాలకు రోడ్లు మరియు బ్రిడ్జిలు వేసేందుకు రూ. 116 కోట్లు మంజూరు చేయించినం. ఆయా గ్రామాల్లో మొత్తం 191.49 కిలోమీటర్ల పొడవుతో 32 రోడ్ల నిర్మాణం చేపట్టిన. అందులో భాగంగా...
గన్నేరువరం ప్రజల చిరకాల వాంఛ అయిన మానేరు నదిపై హైలెవల్ బ్రిడ్జ్ నిర్మాణం కోసం రూ.77 కోట్లు మంజూరు చేయించిన.
ఆర్నకొండ-మల్యాల డబుల్ రోడ్డు విస్తరణ పనుల కోసం రూ.50 కోట్లు మంజూరు చేయించి పనులు ప్రారంభించిన.
వేములవాడ-సిరికొండ రోడ్డు నిర్మాణానికి రూ.23 కోట్ల మంజూరు చేయించి పనులు ప్రారంభం..
కరీంనగర్ జిల్లాలోని విలాసాగర్ మీదుగా కోరేపల్లి నుండి తనుగుల వరకు రూ.10 కోట్ల వ్యయంతో 7 కి.మీ మేరకు రోడ్డు నిర్మాణం. కరీంనగర్ జిల్లాలోని చల్లూరు నుండి కేశవపట్నం వరకు రూ.25 కోట్ల నిధులతో సింగిల్ లేన్ నుండి డబుల్ లేన్ రోడ్డు నిర్మాణం.
కరీంనగర్ జిల్లాలోని బావుపేట్ (ఆసిఫ్‌నగర్) నుండి ఫకీర్‌పేట నుండి కురిక్యాల రోడ్డు వరకు రూ.24 కోట్లతో 16 కి.మీల మేరకు డబుల్ లేన్ రోడ్డు నిర్మాణం. కరీంనగర్ జిల్లాలోని తాడికల్ నుండి యరడపల్లె వరకు రూ.13.5 కోట్లతో 9.కి.మీల మేరకు డబుల్ లేన్ రోడ్డు నిర్మాణం.
కరీంనగర్ జిల్లాలోని ఇందుర్తి నుండి సుందరగిరి వరకు రూ.15 కోట్ల వ్యయంతో10 కి.మీల మేరకు డబుల్ లేన్ రోడ్డు నిర్మాణం.
జగిత్యాల జిల్లాలోని మేడిపల్లి నుండి గోవిందారం వరకు రూ.20 కోట్ల వ్యయంతో 15 కి.మీల మేరకు డబుల్ లేన్ రోడ్డు నిర్మాణం.
జగిత్యాల జిల్లాలోని NH-63 నుండి రంగపేట వరకు రూ.15 కోట్ల వ్యయంతో 10.28 కి.మీ మేరకు రోడ్డు నిర్మాణం.
జగిత్యాల జిల్లాలో మల్లియాల్ నుండి పెగడపల్లి వరకు రూ.20 కోట్ల వ్యయంతో 14.41 కి.మీల మేరకు రోడ్డు నిర్మాణం.
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పెద్దలింగాపూర్ నుండి బద్దెనపల్లి, రామన్నపల్లి & బస్వాపూర్ మీదుగా రూ.20 కోట్ల వ్యయంతో 14 కి.మీ మేరకు రోడ్డు నిర్మాణం
రాజన్న సిరిసిల్ల జిల్లా మల్లారెడ్డిపేట మీదుగా లింగన్నపేట నుండి కోరుట్లపేట వరకు రూ.15 కోట్ల వ్యయంతో 10.2 కి.మీల మేరకు రోడ్డు నిర్మాణం.
సిద్దిపేట జిల్లాలోని ఇందుర్తి నుండి హుస్నాబాద్ వరకు రూ.24 కోట్లతో 16 కి.మీల మేరకు డబుల్ లేన్ రోడ్డు నిర్మాణం.
సిద్దిపేట జిల్లాలోని PWD రహదారి శనిగరం నుండి సుందరగిరి వరకు రూ.18 కోట్లతో 12 కి.మీల మేరకు రోడ్డు నిర్మాణం.
పేద, మధ్య తరగతి ప్రజల కోసం నేను చేసిన మచ్చుకు కొన్ని సేవా కార్యక్రమాలివి :
ప్రభుత్వ, శిశు మందిర్ పాఠశాలల్లో టెన్త్ చదువుకునే విద్యార్థినీ, విద్యార్థులందరికీ ‘మోదీ గిఫ్ట్’ పేరుతో ఉచితంగా 20 వేల బ్రాండెడ్ సైకిళ్లను పంపిణీ చేసిన. అతి త్వరలోనే ప్రభుత్వ స్కూళ్లలో 9వ తరగతి చదివే విద్యార్థినీ, విద్యార్థులందరికీ ఉచితంగా బ్రాండెడ్ సైకిళ్లను అందించబోతున్నా. వచ్చే విద్యా సంవత్సరం ఆరంభంలోనే ప్రభుత్వ స్కూళ్లలో 1 నుండి 6వ తరగతి వరకు చదువుకునే పిల్లలందరికీ ‘మెదీ కిట్’ పేరుతో నోట్స్ బుక్స్, పెన్నులు, పెన్సిళ్లు, జామెట్రీ బాక్స్ సహా బ్రాండెడ్ స్కూల్ బ్యాగ్ ను అందించబోతున్నా.
ప్రతి ఊరిలో వివిధ సామాజిక వర్గాలు నిర్మించే కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి నా వంతుగా ఎంపీ లాడ్స్ నిధులిచ్చిన.
ప్రతి ఊరిలో బోర్లు వేసుకునేందుకు అవసరమైన మేరకు ఎంపీ లాడ్స్, సీఎస్సార్ నిధులు అందించిన పేద, మధ్య తరగతి ప్రజలు టెస్టుల కోసం కరీంనగర్ జిల్లా ఆసుపత్రికి రూ.3 కోట్ల విలువైన అంబులెన్సులు, ఎక్సరే మిషన్ సహా మెడికల్ ఎక్విప్ మెంట్స్ ను అందించిన. వేములవాడ, హుస్నాబాద్, హుజూరాబాద్, జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రులకు రూ.5 కోట్ల విలువైన అత్యాధునిక మెడికల్ ఎక్విప్ మెంట్స్ అందించిన. కరీంనగర్, సిరిసిల్ల మెడికల్ కాలేజీల విద్యార్థుల కోసం ఉచితంగా బస్సు సౌకర్యం. ఆయా మెడికల్ కాలేజీ హాస్టళ్లలో వాటర్ ప్లాంట్స్, ఫ్యాన్లు, ఇతర మౌలిక సదుపాయాల ఏర్పాటు చేసిన. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో వందలాది స్కూళ్లలో ఫర్నీచర్, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించిన. ప్రభుత్వ స్కూళ్లలో టెన్త్ చదివే విద్యార్థులందరికీ ఈ ఏడాది ఎగ్జామ్ ఫీజు మొత్తాన్ని చెల్లించిన.
చివరగా నేను కోరేదొక్కటే పనిచేసే వాళ్లకు పట్టం కట్టండి. మన గ్రామాభివ్రుద్ధికి నిధులిస్తున్న మోదీ నాయకత్వంలోని బీజేపీ బలపర్చిన అభ్యర్థులను బలపర్చండి. నయాపైసా ఇయ్యకుండా ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా రాజకీయాలు చేస్తూ పచ్చని పల్లెల్లో చిచ్చుపెడుతున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు బుద్ది చెప్పాలంటే... ఆయా పార్టీలు బలపర్చిన అభ్యర్థులను మీ విలువైన ఓటు అనే ఆయుధంతో ఓడించండి.
