చోరికి గురైన 71 సెల్ ఫోన్లను తిరిగి అప్పగించిన నిర్మల్ పోలీసులు..

మొబైల్ ఫోన్ పోయిన, చోరికి గురైనా www.ceir.gov.in లో రిజిస్టర్ చేసుకోవాలి.
జిల్లా పరిధిలో  పోగొట్టుకున్న, చోరికి గురైన 71 మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేత.

WhatsApp Image 2025-11-11 at 12.20.33 PM

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా : 

Read More నేటి భారతం :

సెకండ్ హ్యాండ్ మొబైల్స్ లో చోరీ ముఠాలను గుర్తించాలని పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల ఆదేశం నిర్మల్ జిల్లా ఎస్పీ డా.జి. జానకి షర్మిల ఆదేశనుసారంగా, నిర్మల్ పోలీసులు మొబైల్ దొంగతనాలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి CEIR పోర్టల్‌ను సమర్థవంతంగా వినియోగించి నెల రోజుల్లో *71 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేశారు.  సెల్ ఫోన్  పోయిన, చోరీకి గురైన ఆందోళన చెందవద్దని CEIR ద్వారా తిరిగి పొందవచ్చని జిల్లా ఎస్పీ అన్నారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో పోగొట్టుకున్న, చోరి గురైన 71 మొబైల్ ఫోన్లు *(ఎనిమిది లక్షల యాభై రెండు వేల విలువ గల ఫోన్లను) స్వాధీనం చేసుకొని బాధితులకు అప్పగించారు.

Read More రెండు లక్షల 50 వేల రూపాయల ఎల్ఓసిని అందజేసిన ఎమ్మెల్యే జిఎంఆర్

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ... మొబైల్ వినియోగదారులను అప్రమత్తంగా ఉండాలన్నారు. పోయిన సెల్ ఫోన్ పట్ల అశ్రద్ధ చేస్తే ఇది వ్యక్తిగత, సామాజిక భద్రతకు భంగం కలుగుతుందన్నారు. పోయిన లేదా చోరీకి గురైన మొబైల్ ఫోన్లను త్వరితగతిన పట్టుకోవడానికి CEIR వెబ్సైట్ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.CEIR  వెబ్సైట్లో వినియోగదారులు సంబంధిత పోలీస్ స్టేషన్ లో వారి వివరాలను నమోదు చేసుకుంటే మొబైల్స్ ని ఈ పోర్టల్  ద్వారా సులభంగా స్వాధీనం చేసుకునే ఆస్కారం ఉంటుందని తెలిపారు. పోయిన సెల్ ఫోన్ల రికవరీ కోసం ఒక  ప్రత్యేక టీం ఏర్పాటు చేయడం జరగిందని అన్నారు.

Read More నేటి భారతం :

ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 1806 ఫోన్లు (సుమారుగా రెండు కోట్ల పదహారు లక్షల డెబ్భై రెండు వేల రూపాయల విలువ గల ఫోన్లను) రికవరీ చేసి బాధితులకు అందించడం జరిగిందని అన్నారు. సెకండ్ హ్యాండ్ మొబైల్ ఫోన్ల కొనుగోలు, విక్రయాలపై కఠినంగా పర్యవేక్షణ చేయాలని సూచించారు.వినియోగ దారులు,సెకండ్ హ్యాండ్ మొబైల్స్ కొనేటప్పుడు అవి ఎక్కడి నుండి వచ్చినవి, చోరీకి గురైనవో కాదో సరిచూసుకోవాలని, అనుమానం ఉన్న ఫోన్లను కొనరాదని తెలిపారు. అంతేకాకుండా ఒకే వ్యక్తి వద్ద లేదా కొద్ది మంది వద్ద పెద్ద సంఖ్యలో మొబైల్స్ దొరికితే, వారు ఏదైనా చోరీ ముఠా లేదా అనుమానాస్పద కార్యకలాపాలలో భాగమా అనే దానిపై సమగ్ర విచారణ చేయాలని అడిషనల్ ఎస్పీకి ప్రత్యేక సూచనలు ఇచ్చారు. CEIR ఆవశ్యకతను తెలుపుతూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు.ఎవరికైనా సెల్ఫోన్లు దొరికితే సంబంధిత పోలీస్ స్టేషన్లో గాని లేదా ఆ నెంబర్ వారికి ఫోన్ చేసి వారికి అప్పగించాల్సిందిగా సూచించారు.ఈ సందర్భంగా సాంకేతికతను ఉపయోగించి మొబైల్ ఫోన్లు రికవరీ చేయడంలో ప్రతిభ కనబరిచిన ఐటి కోర్ సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు. 

Read More మాజీ ఎమ్మెల్యేను మర్యాద పూర్వకంగా కలిసిన ఏకగ్రీవమైన సర్పంచ్ కేతిరి

About The Author