చిన్న మల్లారెడ్డి గ్రామ పంచాయితి కార్యాలయంలో నామినేషన్స్
- స్వీకరణ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

కామారెడ్డి జిల్లా :
నామినేషన్ కోసం వచ్చే అభ్యర్థులకు టోకెన్లు జారీ చేసి క్రమబద్ధంగా స్వీకరించాలన్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కార్యాలయంలో తగిన వసతులు ఏర్పాటు చేయాలని సంబంధించిన సిబ్బందికి సూచనలు చేశారు. ఎన్నికల నిర్వహణలో పారదర్శకత ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సర్పంచ్, వార్డు స్థానాల కొరకు నిర్వహిస్తున్న ఎన్నికలను ఎలాంటి తప్పిదాలు, పొరపాట్లకు తావులేకుండా ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించాలని సూచించారు. అనంతరం నామినేషన్ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ ను పరిశీలించి అవసరమైన వారికి సహాయ సహకారాలు అందించాలని సూచించారు. విధుల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలని, ఎన్నికల ప్రవర్తన నియమావళి తప్పకుండా అమలయ్యేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విక్టర్, డిఎల్ పిఓ శ్రీనివాస్, ఎమ్మార్వో జనార్ధన్, తదితరులు పాల్గొన్నారు.
