పార్టీని నమ్ముకుంటేనే సముచిత స్థానం

- టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి 
- కవలంపేట గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా శ్రీశైలం

WhatsApp Image 2025-12-08 at 6.44.05 PM

సంగారెడ్డి : 

Read More కాంగ్రెస్ పార్టీకి కామారెడ్డి ప్రజలు స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారు..

కష్టకాలంలో పార్టీని నమ్ముకుని పని చేసిన వారికి పార్టీలో సముచిత స్థానం ఉంటుందని టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. సోమవారం  కంది మండలం కమలంపేట గ్రామ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి కమ్మరి శ్రీశైలం ను ఎంపిక చేసి ఆయన గెలుపుకు కార్యకర్తలు నాయకులు కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. గత పదిహేళ్లుగా అధికారంలో పార్టీ లేకున్నా అహర్నిశలు పార్టీ అభివృద్ధి కోసమే పని చేసిన కార్యకర్తలు నాయకులను గుర్తించి సముచిత స్థానం కల్పిస్తామన్నారు. శ్రీశైలం పార్టీ కోసమే కష్టకాలంలో పని చేసిన వ్యక్తి అని స్పష్టం చేశారు. కవలంపేట గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా శ్రీశైలం గెలుపు కోసం అందరూ కష్టపడి పని చేయాలన్నారు. సీనియర్ నాయకులు దుండిగళ్ళ రాజేందర్ రెడ్డి సైతం కమ్మరి శ్రీశైలం కు మద్దతుగా ప్రచారం చేసేందుకు ముందుకు రావడం మంచి పరిణామం అన్నారు.  అందరూ కాంగ్రెస్ పార్టీని గెలిపించే దిశగా కృషి చేయాలన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి శ్రీశైలం ను గెలిపించాలన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు.

Read More జాతీయస్థాయి కళాకారులకు సన్మానం

About The Author