
కరీంనగర్ :
శాతవాహన యూనివర్సిటీ విద్యార్థుల ఆధ్వర్యంలో పేజీ మూడో సెమిస్టర్ పరీక్షను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు. గ్రామపంచాయతీ ఎలక్షన్ సందర్భంగా వీసీ తన సొంత నిర్ణయాలతో పరీక్షలు నిర్వహించడం సరైనది కాదని విధ్యార్థులు చెప్పారు. యూనివర్సిటీలో దూర ప్రాంతాల నుండి వచ్చి చదువుకుంటున్న విద్యార్థులు చాలామంది ఉన్నారనీ, వెళ్లి రావాలన్న చాలా సమయం పడుతుందనీ ఆలోచించకుండా పరీక్షలు నిర్వహించడం సరైనది కాదన్నారు. డిసెంబర్ నెలలోనే సెట్ ఎగ్జామ్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఉందనీ, యూనివర్సిటీలో విద్యార్థులు సెట్టుకు ప్రిపేర్ అవుతున్నారని చెప్పారు. వెంటనే పరీక్షలను తాత్కాలికంగా వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. యూనివర్సిటీలోని లైబ్రరీ టైమింగ్స్ పెట్టి విద్యార్థులను ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి ఉందనీ, యూనివర్సిటీ అంటేనే విద్యార్థులు కోటి ఆశలతో కాంపిటీషన్ పరీక్షలకు సిద్ధం కావాలి అని వస్తే విసి లైబ్రరీని మూసివేస్తున్న పరిస్థితి ఉందనీ ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు వెళ్ళి అడిగితే విద్యార్థులను టార్గెట్ చేస్తున్న పరిస్తితి విసి ఇష్టం అన్నారు. తక్షణమే వీసీ చొరవ తీసుకొని విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.