గ్రామ పంచాయతీలకు జరగనున్న రెండవ సాధారణ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

కామారెడ్డి :
డిసెంబర్ 02: తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీలకు జరగనున్న రెండవ సాధారణ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల నేపథ్యంలో, ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అన్ని అంశాలను సమీక్షించేందుకు సోమవారం తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని అధ్యక్షతన నిజామాబాద్, కామారెడ్డి, ఖమ్మం, భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు సంబంధిత జిల్లాల పోలీస్ కమిషనర్లు / జిల్లా ఎస్పీల తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
సున్నిత, అత్యంత సున్నిత ప్రాంతాల గుర్తింపు. పోలీస్ బందోబస్తు, రూట్ మ్యాప్స్ రాండమ్ విధుల నియామకం ఊహించదగిన సమస్యల నివారణకు ముందస్తు చర్యలు. ప్రవర్తనా నియమావళి (ఎమ్ సి సి) అమలు అభ్యర్థులు, రాజకీయ నాయకుల ప్రచార కార్యక్రమాలపై పర్యవేక్షణ. నిబంధనలు ఉల్లంఘించినట్లయితే తక్షణ చర్యలు. సోషల్ మీడియా మానిటరింగ్. పోస్టల్ బ్యాలెట్ పై సూచనలు గ్రామ పంచాయతీల రెండవ సాధారణ ఎన్నికలలో పోస్టల్ బ్యాలెట్ వినియోగం జిల్లాలో చేపడుతున్న వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లాలో గ్రామ పంచాయితీ ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని, పోలీస్ బందోబస్తు, ఎస్ ఎస్ టి, ఎఫ్ ఎ టి టీముల విధులు నిర్వహిస్తున్నారన్నారు.
గ్రామ పంచాయతీల రెండవ సాధారణ ఎన్నికలలో పోస్టల్ బ్యాలెట్ జారీ ప్రక్రియపై జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పలు సూచనలు చేశారు.
పోస్టల్ బ్యాలెట్‌కు అర్హులు:
సర్వీస్ ఓటర్లు, సభ్యులు, ఎన్నికల విధుల్లో ఉన్న పోలింగ్ సిబ్బంది. గ్రామ పంచాయతీ ఎన్నికలకు కేటాయించిన మొదటి సిరీస్ నుండే పోస్టల్ బ్యాలెట్ పేపర్లు జారీ చేయబడతాయి.
సర్పంచ్, వార్డ్ సభ్యుల ఎన్నికలకు:
స్టేజ్–2 ఆర్ఓ : ఎన్నికల విధుల్లో ఉన్న పోలింగ్ సిబ్బంది, అత్యవసరం: అభ్యర్థిత్వ ఉపసంహరణ గడువు ముగిసిన 24 గంటలలోపు సర్వీస్ ఓటర్లకు పోస్టల్ బ్యాలెట్ తప్పనిసరిగా పంపాలి. ఆర్ఓలు ముందుగానే ఫారం XVII, XVIII, XIX, XX, కవర్లు, ఫాక్సిమేల్ స్టాంప్, సర్వీస్ ఓటర్ల మార్క్ డ్ కాపి, సిద్ధం చేసుకోవాలి. పోస్టల్ బ్యాలెట్ వెనుక వైపు , కౌంటర్ ఫాయిల్ పై ఆర్ఓ ఫాక్సిమేల్ ను రెండు చోట్ల తప్పనిసరిగా ముద్రించాలి. ఫారం–XX లో పోటీచేయు అభ్యర్థుల పేర్లు వారి గుర్తుల క్రమంలో నమోదు చేయాలి, పోస్టల్ బ్యాలెట్ తిరిగి చేరాల్సిన తేది, సమయం స్పష్టంగా పేర్కొనాలి. “పోస్టల్ బ్యాలెట్ జారీ ప్రక్రియలో జాప్యం జరగకుండా అధికారులు కర్తవ్యబద్ధంగా వ్యవహరించాలి. సర్వీస్ ఓటర్ల ఓటు హక్కు పరిరక్షణ అత్యంత ముఖ్యము.” అని కలెక్టర్ తెలిపారు..
