ఎన్నికలలో రిటర్నింగ్ ఆఫీసర్లు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి

జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవర్

WhatsApp Image 2025-12-01 at 5.07.25 PM

సూర్యాపేట : 

త్వరలో నిర్వహించబోయే గ్రామపంచాయతీ ఎన్నికల్లో రిటర్నింగ్ అధికారులు నిష్పక్షపాతంగా పార దర్శకంగా ప్రజాస్వామ్య పద్ధతిలో బాధ్యతగా ఎన్నికల విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. 

సోమవారం సమీకృత జిల్లా కలెక్టరేట్  కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ఫేస్-టు రిటర్నింగ్ అధికారుల శిక్షణ కార్యక్రమంలో  పాల్గొని  రిటర్నింగ్ ఆఫీసర్లకు పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నుంచి ఎన్నికల ప్రక్రియ ముగిసేంత వరకు రిటర్నింగ్ ఆఫీసర్ కు పూర్తి బాధ్యత ఉంటుందని, అభ్యర్థి రోజు వారి ఎన్నికల ఖర్చు వివరాలను తనిఖీ చేయడం, వివరాలు ఇవ్వడంలో విఫలమైతే వారికి  నోటీసులు జారీ చేసే అధికారం, మండల కేంద్రం నుండి పోలింగ్ మెటీరియల్ సర్పంచ్, వార్డు  పోలింగ్ కేంద్రానికి, పి ఓ కి అందచేయాలని మీకు సంబంధించిన  గ్రామపంచాయతీలో పోలింగ్ స్టేషన్ ఏర్పాట్లు ఇతర పోలింగ్ ఏర్పాట్లు పరిశీలించాలని, ఓటర్లకు బిఎల్ఓ ద్వారా ఫోటో ఓటర్ స్లిప్స్ పంపిణీ చేయాలని, పోలింగ్ సిబ్బందిని పోలింగ్ స్టేషన్ కు పంపించడం సామాగ్రి సరఫరా, పోలింగ్ సమర్థవంతంగా పర్యవేక్షించడం, పై అధికారులకు నివేదికలు పంపించాలని, పోలింగ్ జరిగేటప్పుడు ఏదైనా అనుకోని సమస్య ఎదురైతే వాటిని పరిష్కరించాలని  కౌంటింగ్ ప్రదేశం, పోలీస్ సిబ్బంది, స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు, ఫలితాలు ప్రకటించుట, ఉప సర్పంచ్ ఎన్నిక, ధ్రువపత్రాల పంపిణీ, వ్యయాన్ని పర్యవేక్షించటం, పోస్టల్ బ్యాలెట్ నిర్వహణ సంబంధిత విధులు రిటర్నింగ్ ఆఫీసర్లు సమర్థవంతంగా నిర్వహించాలని పూర్తిగా చెక్ లిస్ట్ ప్రకారం  బాధ్యతలు నిర్వహించాలని, ఎలాంటి పొరపాటు జరిగినచో ఎన్నికలపై ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని కోల్పోవడం జరుగుతుందని, ప్రజాస్వామ్య బద్ధంగా, బాధ్యతయుతముగా ఎన్నికల విధులు నిర్వహించి సూర్యాపేట జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు విజయవంతంగా పూర్తి చేయడం మీ అందరి బాధ్యత అని కలెక్టర్ అన్నారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కె సీతారామారావు, డిపిఓ యాదగిరి, డి ఆర్ డి ఏ పి డి వి వి అప్పారావు, డీఎఫ్ఓ సతీష్, ట్రైనర్లు రమేష్, వెంకటేశ్వర్లు,రిటర్నింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.. 

About The Author