
సంగారెడ్డి :
జిల్లా టిఆర్ఎస్ నాయకులు కాసాల బుచ్చిరెడ్డి కోడలి వివాహ వేడుకల్లో సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ముఖ్యఅతిథిగా పాల్గొని నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. గురువారం ఘట్కేసర్ లక్ష్మీ కన్వెన్షన్ లో జరిగిన వివాహ వేడుకల్లో చింతా ప్రభాకర్ పాల్గొని నూతన దంపతులకు ఆశీస్సులు అందించారు. ఎమ్మెల్యే వెంట పార్టీ జిల్లా నాయకులు జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావు, తదితరులు పాల్గొన్నారు.