
కామారెడ్డి :
శుక్రవారం తాడ్వాయి మండల కేంద్రంలో సద్గురు శ్రీ శబరి మాతాజీ దివ్య పాదుకా పూజోత్సవ వేడుకలు శోభాయమానంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే మదన్ మోహన్ ప్రత్యేక పూజల్లో పాల్గొని అమ్మవారి పాదుకాలకు అభిషేకం చేశారు. భక్తుల సమక్షంలో నిర్వహించిన పూజా కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో సాగాయి.
అనంతరం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో ఎమ్మెల్యే మదన్ మోహన్ పాల్గొని, వచ్చిన భక్తులకు స్వయంగా అన్నదానం చేశారు. భక్తులకు సేవ చేయడం ఆనందంగా ఉందని ఎమ్మెల్యే తెలిపారు. స్థానికులు, భక్తులు, సేవక బృందం కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.