
సంగారెడ్డి :
సదాశివపేట మండలంలోని ఎల్లారం గ్రామంలో సర్పంచ్ చాట్ల మల్లేశం ప్రచారం ముమ్మరంగా కొనసాగుతోంది. గ్రామ ప్రజలతో మాట్లాడుతూ సమస్యలను నేరుగా తెలుసుకోవడంపై ఆయన దృష్టి సారించారు.ప్రజలే శక్తి, గ్రామమే అభివృద్ధి కేంద్రంగా ఉండాలని భావిస్తున్నానని మల్లేశం తెలిపారు. గ్రామంలో మురికి కాల్వలు, సీసీ రోడ్లు, వీధి దీపాలు, తాగునీటి సమస్య, క్రీడా ప్రాంగణం వంటి అంశాలపై ప్రజల నుండి వచ్చిన సూచనలు, అభ్యర్థనలను ఆధారంగా తీసుకుని పరిష్కార మార్గాలు సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు.గ్రామాభివృద్ధిని ప్రాధాన్యంగా తీసుకొని పలు రంగాల్లో రూపకల్పన చేసిన పనులు విజయవంతం అవుతాయన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. ప్రజల సహకారం లభిస్తే గ్రామాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు తాను సిద్ధంగా ఉన్నానని మల్లేశం స్పష్టం చేశారు.