సైన్స్ జీవితానికి ఉపయోగపడాలీ
బాల వైజ్ఞానిక ప్రదర్శిని ముగింపు కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి శ్రీరాం మొండయ్య సాంస్కృతిక ప్రదర్శనలతో ఘనంగా ముగింపు ఉత్సవ కార్యక్రమం మూడు రోజులపాటు అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించిన వైజ్ఞానిక ప్రదర్శిన

కరీంనగర్ :
సైన్స్ జీవితానికి ఉపయోగపడాలని జిల్లా విద్యాధికారి శ్రీరామ్ ముందయ్య అన్నారు. గత మూడు రోజులుగా కొత్తపల్లిలోని ఆల్ఫోర్స్ ఈ టెక్నో స్కూల్లో జరుగుతున్న బాల వైజ్ఞానిక ప్రదర్శిని 25-26 ముగిసింధీ. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పిల్లలు శాస్త్రవేత్తలుగా ఎదగాలని ప్రతి విద్యార్థి లోపల ఒక శాస్త్రవేత్త దాగి ఉన్నాడని, బయటకు తీసి నూతన ఆవిష్కరణలకు నాంది పలకాలని పేర్కొన్నారు.
శ్రమ పట్టుదలతో పని చేస్తే సాధించలేనిది ఏమీలేదని విద్యార్థులు శ్రమించే తత్వాన్ని అలవాటు చేసుకోవాలని వారు సూచించారు.
ఈరోజు సైన్స్ రేపటి అభివృద్ధి చెందిన టెక్నాలజీకి దారి తీస్తుందని అది మానవాళి క్షేమానికి ఉపయోగపడుతుందని, మానవాళి సంక్షేమానికి ఉపయోగపడేదే అసలైన సైన్స్ అని వారు తెలిపారు.
సైన్స్ అనేది మానవ జీవితానికి ఉపయోగపడాలి తప్ప వినాశనానికి కాదని ఏ నూతన ఆవిష్కరణ అయినా మానవ వికాసానికి దారి తీయాలని ఆ దిశగా విద్యార్థుల కృషి చేయాలని వారు సూచించారు. సూత్రాలు వల్లెవేయడం వలన లాభం లేదని దానిలోని లాజిక్కుని తెలుసుకొని ముందడుగు వేయాలని వారు తెలిపారు. ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ వి. నరేందర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు ఐఐటీలు, నీటులు, నిట్ లు వదిలేసి శాస్త్రవేత్తలుగా ఎదగడానికి జాతీయస్థాయిలో మంచి మంచి లాబరేటరీలు ఉన్నాయని అందులో సీటు సంపాదించి గొప్ప శాస్త్రవేత్తలుగా ఎదిగి ఈ దేశానికి సేవ చేయాలని వారు కోరారు.
జిల్లా సైన్స్ అధికారి చాడ జయపాల్ రెడ్డి మాట్లాడుతూ బాల వైజ్ఞానిక ప్రదర్శిని అంగరంగ వైభవంగా సాగిందని మూడు రోజుల కార్యక్రమంలో ఎగ్జ్బిట్స్ ప్రదర్శించిన విద్యార్థులు, గైడ్ టీచర్స్ వాళ్ల ప్రదర్శనతో పాటు ఇతరుల ప్రదర్శనలను తిలకించి సైన్స్ ఎక్స్ప్లోర్ చేసుకున్నారని, ఇది గొప్ప విషయమని పేర్కొన్నారు. ఈ ఎగ్జిబిషన్ కు 807 ఎగ్జిబిట్స్, 126 ఇన్స్పైర్ అవార్డ్స్ మనక్ వచ్చాయని మొదటి రోజు 1600 మంది విద్యార్థులు సందర్శించారని రెండో రోజు 2652 మంది విద్యార్థులు , ఈరోజు 5357 మంది విద్యార్థులు దాదాపు 176 పాఠశాలలు సందర్శించాయని తెలిపారు.
తదనంతరం ఫలితాలు ప్రకటించడం జరిగింది. ఈ ఫలితాలలో 13 ప్రాజెక్ట్లు ఇన్స్పైర్ కోసం రాష్ట్ర స్థాయికి ఎన్నిక కాబడినాయని మిగతావి ప్రతి థీమ్ నుండి ప్రథమస్థానంలో వచ్చిన వాటిని రాష్ట్రస్థాయికి పంపడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉమ్మడి పరీక్షల బోర్డు కార్యదర్శి ఎస్ భగవంతయ్య, సెక్టోరియల్ అధికారులు కర్ర అశోక్ రెడ్డి, ఆంజనేయులు, మిల్కూరి శ్రీనివాస్, కృపారాణి,ఎస్జీఎఫ్ సెక్రటరీ వేణుగోపాల్ కొత్తపల్లి మండల విద్యాశాఖాధికారి ఆనందం, ఏనుగు ప్రభాకర్ రెడ్డి, వివిధ మండలాల విద్యాధికారులు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు గాజుల రవీందర్,కెఎస్.అనంతాచార్య, స్తంభంకాడి గంగాధర్
మరియు గైడ్ టీచర్స్ తదితరులు పాల్గొన్నారు.
ఇన్ స్పైర్ - మనక్ విజేతలు :
మొత్తం 13 మంది విజేతలను రాష్ట్రస్థాయికి ఎంపిక చేయడం జరిగింది. జె.వైష్ణవి, టి.జి.ఎమ్.ఎస్. చిగురుమామిడి, పి.సాయి గణేశ్, జెడ్.పి.హెచ్.ఎస్ బూరుగుపల్లి ఎస్.శశివర్ధన్, జెడ్.పి.హెచ్.ఎస్ గట్టుబూత్కూర్, ఎ.వికాస్, పారమిత హెరిటేజ్ స్కూల్, ఎస్.అవిజ్ఞ, ఆల్ ఫోర్స్ హై స్కూల్, ఎన్.సుశీల్ కుమార్, భగవతి హై స్కూల్ సి.హెచ్.సాత్విక్ రెడ్డి, ఏకశిల పాఠశాల, ఇ.సహస్ర, కె.జి.బి.వి. కరీంనగర్,
ఎం హరినాథ్ రెడ్డి, పారమిత హై స్కూల్, బి.మనోజ్ఞ, రావుస్ టెక్నో స్కూల్, వి.అనూష్ రాజ్, సెంట్ జార్జ్ పాఠశాల, ఎన్.వర్షిత, వింధ్యావళి హై స్కూల్, ఎం.చరితేశ్, జడ్.పి.హెచ్.ఎస్ మొలంగూర్,
జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో మొదటి స్థానం పొందిన విజేతలు :
సుస్థిర వ్యవసాయం అనే అంశంలో జూనియర్ విభాగంలో అబ్దుల్ రెహమాన్ సద్, ఇక్రా జమి స్కూల్, సీనియర్స్ విభాగంలో డి.అమర్ నాథ్, సాయి మానేర్ స్కూల్, వ్యర్థ పదార్థాల నిర్వహణలో జూనియర్స్ విభాగంలో ముజకిర్, ఆల్ఫోర్స్ హై స్కూల్, సీనియర్స్ విభాగంలో మిహా ముబారక్, పారమిత హెరిటేజ్ స్కూల్, పునరుత్పాదక శక్తి అంశంలో జూనియర్స్ విభాగంలో ఎ.మదన్ జోస్, అల్ఫోర్స్ హై స్కూల్,
సీనియర్స్ విభాగంలో నితీశ్ కుమార్, ఆల్ఫోర్స్ హై స్కూల్, అభివృద్ధి చెందుతున్న సాంకేతిక అంశంలో జూనియర్స్ విభాగంలో బి.శ్రీధర్ జడ్పిహెచ్ఎస్ బూరుగుపల్లి, సీనియర్స్ విభాగంలో జె.శ్రీవన్శిక, ఏకశిల హైస్కూల్, రిక్రియేషనల్ గణిత నమూనాల అంశంలో జూనియర్స్ విభాగంలో బి.స్నితిక్, ఆల్ఫోర్స్ హై స్కూల్, సీనియర్స్ విభాగంలో ఎస్.అర్చన జెడ్పిహెచ్ఎస్ మల్కాపూర్, ఆరోగ్యము పరిశుభ్రత అంశంలో జూనియర్స్ విభాగంలో కె.రుగ్వేద, పారమిత హైస్కూల్, సీనియర్స్ విభాగంలో కె.లక్ష్మి ప్రసన్న, టెట్రా హైడ్రాన్ పాఠశాల, నీటి సంరక్షణ నిర్వహణ అంశంలో జూనియర్స్ విభాగంలో హర్షిత్ కె.పి.ఎస్. హైస్కూల్, సీనియర్ విభాగంలో వి.హర్షిత్, టి.ఎం.ఆర్.ఎ. కరీంనగర్.. ఉపాధ్యాయుల విభాగంలో స్రవంతి ఎం.పి.యు.పి.ఎస్. చర్లబుత్కూరు మొదటి స్థానం పొందారు. ప్లాస్టిక్ కాలుష్య నివారణకు సంబంధించిన అంశంలో నిర్వహించిన సెమినార్ లో అనుశ్రీ టి.జి.ఎం.ఎస్. ముల్కనూర్ మొదటి స్థానం పొందారు.
