కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు ఆవాల సరోజ మృతి
నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన కాంగ్రెస్ నేతలు

కరీంనగర్ :
జిల్లా కాంగ్రెస్ పార్టీతో ఐదు దశాబ్దాలుగా అనుబంధం...20ఏళ్ల పాటు మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా కొనసాగి పార్టీలో తనదైన ముద్రవేసుకున్నారు. అయితే పార్టీలో జాతీయ స్థాయికి వెళ్లిన నాయకులు, నేతలు సైతం సరక్క అని పిలుచుకునే వారు.. ఆమెనే ఆవాల సరోజ(90) బుధవారం అర్ధరాత్రి మృతిచెందారు. కాంగ్రెస్ పార్టీలో ఆవాల సరోజ మహిళా కాంగ్రెస్ పార్టీలో పలు మార్పులు తీసుకువచ్చారు. మహిళా సూపర్ బజార్ అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వహించి ఎందరో మన్నలను పొందారు. ఆమె అకాల మరణం పార్టీకి తీరని లోటని నాయకులు బాధతప్తహృదయాలతో వెల్లడించారు..ఆమె పార్థీవ దేహానికి కాంగ్రెస్ జెండాను కప్పి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించిన సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కరీంనగర్ నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్ నాయకులు శ్రీనివాస్ రెడ్డిలు ఉన్నారు.
