ప్రపంచ పవర్‌లిఫ్టింగ్‌లో ప్రదీప్‌కుమార్‌కు రజతం.
క్రీడా శాఖ మంత్రి అభినందనలు
హైదరాబాద్:
ఈజిప్టులోని కైరో వేదికగా గత నెలలో జరిగిన ప్రపంచకప్ పవర్‌లిఫ్టింగ్ పోటీల్లో తెలంగాణకు చెందిన రిటైర్డ్ గెజిటెడ్ అధికారి పెరుమాళ్ల ప్రదీప్‌కుమార్ రజత పతకం సాధించారు. మాస్టర్స్ విభాగం 82.5 కిలోల బరువు విభాగంలో పోటీపడ్డ ఆయన.. మొత్తం 400 కిలోల బరువును ఎత్తి రెండో స్థానంలో నిలిచారు.
మల్కాజిగిరి కమిషనరేట్‌లో అకౌంట్స్ ఆఫీసర్‌గా పనిచేసి పదవీ విరమణ పొందిన ప్రదీప్‌కుమార్, అంతర్జాతీయ స్థాయిలో రాణించి రాష్ట్ర కీర్తిని చాటారు. ఈ నేపథ్యంలో సోమవారం రాష్ట్ర క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఆయనను కలిసి అభినందనలు తెలిపారు.
About The Author
29 Apr 2026
