సిర్పల్లి హెచ్ గ్రామంలో సర్పంచ్ పోటీలో బీటెక్ యువకుడు..

- ఉన్నత విద్యావంతుల రాజకీయ అరంగేట్రంతో గ్రామీణ ఎన్నికలకు కొత్త ఊపు

సిర్పల్లి హెచ్ గ్రామంలో సర్పంచ్ పోటీలో బీటెక్ యువకుడు..

WhatsApp Image 2025-12-10 at 6.51.25 PM

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా : 

గ్రామీణ రాజకీయాల్లో కొత్త తరంగానికి నాంది పలుకుతూ యువతరం తమ రాజకీయ ప్రయాణానికి పుట్టి పెరిగిన ఊళ్లను పునాదిగా మార్చుకుంటోంది. అనుభవం, రాజకీయ వారసత్వం లేకపోయినా ప్రజాసేవపై ఉన్న ఆసక్తి, గ్రామాభివృద్ధిపై ఉన్న దృఢసంకల్పం కారణంగా చాలామంది ఉన్నత విద్యావంతులు సర్పంచ్ పోటీలో బరిలోకి దిగుతున్నారు. కుబీర్ మండలంలోని సర్పల్లి హెచ్ గ్రామానికి చెందిన బీటెక్ పట్టభద్రుడు ఎర్రేపల్లి సతీష్ కుమార్ ఈసారి సర్పంచ్‌ అభ్యర్థి పదవికి పోటీ చేస్తున్నారు.మంచి ఉద్యోగావకాశాలు ఉన్నప్పటికీ, గ్రామాభివృద్ధే తన లక్ష్యమని భావించి రాజకీయ చేస్తున్న సతీష్, యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇటువంటి ఉన్నత విద్యావంతులు పల్లెపోరులో నిలవడం ఎన్నికలకు కొత్త జోష్ తీసుకువస్తోంది. పెద్ద వేతనాలను కూడా వదులుకొని ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో యువత ముందుకు రావడం గ్రామీణ రాజకీయాల్లో సానుకూల మార్పులకు నాంది అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

సర్పల్లి హెచ్ గ్రామ ప్రజలు యువనాయకుడి అడుగుపై చర్చలు మొదలవగా, అభివృద్ధి ప్రాధాన్య అంశంగా మారింది. ఎర్రేపల్లి సతీష్ పోటీపై గ్రామంలో ఆసక్తి చెలరేగింది. సతీష్ మాట్లాడుతూ ఒక్క అవకాశం ఇచ్చి ఉంగరం గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీ గెలిపించాలని గ్రామ ప్రజలను కోరారు. 

About The Author