సోనియా గాంధీ గొప్ప నాయకురాలు

- టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
- ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు

సోనియా గాంధీ గొప్ప నాయకురాలు

WhatsApp Image 2025-12-09 at 6.28.35 PM

సంగారెడ్డి : 
:
దేశ ప్రజలు దేవతా మూర్తిగా కొలిచే ఇందిరా గాంధీ కోడలు సోనియాగాంధీ దేశ రాజకీయాలపై తనదైన ముద్ర వేశారని ఇది ఒక చరిత్రని టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. మంగళవారం సంగారెడ్డి పట్టణంలో సోనియాగాంధీ జన్మదిన వేడుకలను పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి పార్టీ శ్రేణులతో కలిసి భారీ కేక్ ను కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... మహాత్మా గాంధీ జవహర్లాల్ నెహ్రూ అడుగుజాడల్లో ఇందిరా గాంధీ రాజీవ్ గాంధీ ఆదర్శలతో యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ దేశ ప్రజలకు ఉపాధి హామీ పథకంతో ఆర్థికంగా ఎదిగేలా కృషిచేసిన గొప్ప నాయకురాలు అని కీర్తించారు. దేశ రాజకీయాలపై సోనియాగాంధీ చెరగని ముద్రవేశారన్నారు. రాజీవ్ గాంధీ ఆలోచన విధానాలను అనుసరిస్తూ ప్రజలకు మేలు జరిగేలా యూపీఏ ప్రభుత్వ హయాంలో జన రంజక పాలన అందించారని ప్రశంసించారు. సోనియాగాంధీ ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ మల్లికార్జున కార్గే నేతృత్వంలో ఇచ్చిన హామీలను తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం గత రెండు సంవత్సరాల కాలంలో నెరవేరుస్తూ ముందుకు వెళుతుందన్నారు. ఉచిత బస్సు ప్రయాణం 2 యూనిట్ల ఉచిత విద్యుత్తు 500 కు గ్యాస్ సన్న బియ్యం తెల్ల రేషన్ కార్డులు ఇలా సంక్షేమ పథకాలను సీఎం రేవంత్ రెడ్డి తో పాటు మంత్రివర్గం అమలు చేస్తుందని పేర్కొన్నారు. ఆర్టీసీని మూసివేయాలని గత ప్రభుత్వం ఆలోచన చేసిన అలాంటిది ఉచిత బస్సుతో ఆర్టీసీని లాభాల్లోకి తెచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అని స్పష్టం చేశారు. పేద ప్రజలకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన అభయహస్తం కాంగ్రెస్దే అని అన్నారు. తెలంగాణ ప్రజలకు నాయకులకు ఇచ్చిన మాట ప్రకారం సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చి మాట నిలుపుకున్నారన్నారు.  ఇచ్చిన మాటకు కట్టుబడే గొప్ప వ్యక్తి సోనియా గాంధీ అన్నారు.  గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎవరికి స్వేచ్ఛ లేదని మీడియాకు స్వేచ్ఛ లేదని ధర్నాలు నిరసనలు తెలిపే స్వేచ్ఛ కూడా ఇవ్వలేదన్నారు. టిఆర్ఎస్ ప్రజా స్వేచ్ఛను హరించిన ప్రభుత్వమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇందిరాపార్కు వద్ద ధర్నా చౌక్ పునరుద్ధరించారని స్పష్టం చేశారు. ప్రజా పాలన కొనసాగిస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ అన్నారు. కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 

Read More అంగరంగవైభవంగా అయ్యప్పస్వామి మహా పడిపూజ

About The Author