విద్యార్థులు పట్టుదలతో చదివి ఉన్నతంగా రాణించాలి

- జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య 

WhatsApp Image 2025-12-09 at 6.03.14 PM

సంగారెడ్డి : 

Read More మాజీ ఎమ్మెల్యేను మర్యాద పూర్వకంగా కలిసిన ఏకగ్రీవమైన సర్పంచ్ కేతిరి

విద్యార్థులు పట్టుదలతో చదివి ఉన్నతంగా రాణించాలని జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య సూచించారు.మంగళవారం జోగిపేట ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలను కలెక్టర్  ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల తరగతి గదులను, శుభ్రతను, విద్యార్థుల హాజరును, ఉపాధ్యాయుల హాజరు రిజిస్టర్‌ను పరిశీలించారు. కలెక్టర్  తరగతుల్లో చదువుతున్న విద్యార్థులతో ప్రత్యక్షంగా ముచ్చటిస్తూ సిలబస్ పూర్తయిందా, బోధన విధానం ఎలా ఉంది, పాఠాలు అర్థమవుతున్నాయా, ఏమైనా సమస్యలు ఉన్నాయా అని ఆరాతీశారు. విద్యార్థులు చదువుపై దృష్టి  పెట్టి చదువులో ముందుండాలని, ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలను ప్రతిరోజూ పునశ్చరణ చేయాలని సూచించారు.ప్రధానోపాధ్యాయురాలిని మొత్తం విద్యార్థుల సంఖ్య, రోజువారీ హాజరు, బోధన , తరగతుల నిర్వహణకు
సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజూ విద్యార్థుల పూర్తి హాజరు ఉండేలా చర్యలు తీసుకోవాలనీ,సిలబస్‌ను నిర్ణీత సమయానికి పూర్తిచేసి, రివిజన్ క్లాసులను నిర్వహించాలన్నారు. విద్యార్థులను పరీక్షలకు అన్ని విధాల సిద్ధం చేయాలని సూచించారు. కలెక్టర్ వెంట రెవెన్యూ డివిజనల్ అధికారి పాండు, తహసిల్దార్ మధుకర్ రెడ్డి,ఇంచార్జీ ప్రధానోపాధ్యాయురాలు సుధ ,తదితరులు పాల్గొన్నారు.

Read More బీఆర్ఎస్ బిజెపి కనుమరుగు ఖాయం

About The Author