రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ – 2047 జూమ్ సమావేశం

- హాజరైన జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల.

WhatsApp Image 2025-12-01 at 6.24.30 PM

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యూరో : 

Read More మహా ధర్నా ఎవరికోసం? ఎందుకోసం?

తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధి, శాంతి–భద్రత, పరిపాలనా సామర్థ్య పెంపు, స్మార్ట్ గవర్నెన్స్ లాంటి ముఖ్యాంశాలపై దృష్టి సారిస్తూ గౌరవ రాష్ట్ర డీజీపీ  శివధర్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ – 2047 జూమ్ సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశానికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ఐపీఎస్ అధికారులు, డిప్యూటేషన్ యూనిట్ల అధికారులు, చీఫ్ ఆఫీస్‌కు చెందిన స్టాఫ్ ఆఫీసర్లు హాజరయ్యారు. రాష్ట్ర భద్రతా వ్యవస్థను బలోపేతం చేయడం, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, భవిష్యత్తు పట్టణ, గ్రామీణ అభివృద్ధి అవసరాలకు అనుగుణంగా పోలీసింగ్ విధానాలను మెరుగుపరచడంపై ఈ సమావేశంలో విస్తృత చర్చ జరిగింది.నిర్మల్ జిల్లా నుండి జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల  ఈ జూమ్ సమావేశానికి హాజరై, జిల్లాలో అమలు చేస్తున్న మంచి పద్ధతులు, భద్రతా చర్యలు, ప్రజా సేవల విస్తరణ కోసం చేపడుతున్న వినూత్న విధానాలను గురించి వివరించారు. అదే సమయంలో, భవిష్యత్‌లో తెలంగాణను ఒక గ్లోబల్ లీడర్‌గా నిలబెట్టే దిశగా పోలీస్ శాఖ పాత్ర, నూతన వ్యూహాలు, సాంకేతిక ఆధారిత సేవల విస్తరణ వంటి అంశాలపై అభిప్రాయాలను పంచుకున్నారు.

Read More నేటి భారతం :

రాష్ట్రంలో ప్రజా భద్రతను మరింత బలోపేతం చేసి, స్మార్ట్, స్పందనాత్మక, పారదర్శక పోలీసింగ్ వైపు అడుగులు వేయడానికి ఈ సమావేశం కీలకంగా నిలిచిందని జిల్లా ఎస్పీ తెలిపారు. 

Read More అంధుల పాఠశాల విద్యార్థినితో కలిసి పాడిన జిల్లా కలెక్టర్

About The Author