మొదటి విడత పోలింగ్ ప్రశాంతంగా జరిగాయి.

ములుగు జిల్లా ప్రతినిధి :
జిల్లాలో గ్రామ పంచాయతీ మొదటి విడత ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగాయి. పోలింగ్ 78.65 శాతం నమోదు అయింది. గోవిందరావుపేట, ఎస్.ఎస్. తాడ్వాయి, ఏటూరు నాగారం మండలాల్లో గురువారం పోలింగ్ నిర్వహించారు. మూడు మండలాల్లో కలిపి మొత్తం 60, 361 ఓట్లు ఉండగా, 47,472 పోల్ అయ్యాయి. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 78.65 శాతం పోలింగ్ నమోదు అయింది.
మండలాల వారిగా ఓటర్లు.. నమోదు అయిన పోలింగ్ శాతం. గోవిందరావుపేట మండలంలో మొత్తం ఓటర్లు 20,402 మంది ఉండగా,
15,501 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 75.98 శాతం నమోదు అయింది. ఎస్.ఎస్. తాడ్వాయి మండలంలో మొత్తం ఓటర్లు 16,680 మంది ఉండగా, 13,928 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 83.50 శాతం నమోదు అయింది. ఏటూరు నాగారం మండలంలో మొత్తం ఓటర్లు 23,279 మంది ఉండగా, 18,043 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 77.51శాతం నమోదు అయిందని అధికారులు తెలిపారు.
