రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను పరిశీలించిన ఐటీ మంత్రి, అధికారులు

WhatsApp Image 2025-12-02 at 6.40.34 PM

మహేశ్వరం : 

Read More జాతీయస్థాయి కళాకారులకు సన్మానం

మహేశ్వరం ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను ఐటీ మంత్రి శ్రీధర్ బాబు, చీఫ్ సెక్రటరీ రామకృష్ణ రావు, రాచకొండ సిపి సుధీర్ బాబు అధికారులతో కలిసి గ్లోబల్ సమ్మిట్ వేదిక వద్ద ఇతర విభాగాల ఉన్నతాధికారులతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు.అనంతరం అన్ని డిపార్ట్మెంట్ అధికారులకు దిశా నిర్దేశం చేశారు.సమ్మిట్ జరిగే ప్రాంగణంలో ఏర్పాట్లను అధికారులతో స్వయంగా పరిశీలించి వారికి సలహాలు, సూచనలు చేసిన శ్రీధర్ బాబు. అయిదో తారీకు లోపు పనులన్నీ పూర్తి చేసి, ఆరో తేదీన డ్రైరన్ కండక్ట్ చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ప్రపంచం దృష్టిని ఆకర్షించేలా,  తెలంగాణ బ్రాండ్ మరింత విశ్వవ్యాప్తం అయ్యేలా ఏర్పాట్లు చేయాలని, ఏ ఒక్క చిన్న పొరపాటు జరగకుండా అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆదేశాలు జారీ చేశారు.విభాగాల వారీగా అప్పగించిన బాధ్యతలు, వాటి పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఇతర దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చే అతిథులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకోవాలని సూచించారు. పార్కింగ్, లాజిస్టిక్స్, హాస్పిటాలిటీ, శానిటేషన్ పై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. 

Read More కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు ఆవాల సరోజ మృతి

About The Author