కాంగ్రెస్ పార్టీకి కామారెడ్డి ప్రజలు స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారు..
బీజేపీ జిల్లా ఇంచార్జి విక్రమ్ రెడ్డి

కామారెడ్డి :
శుక్రవారం బీజేపీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు అధ్యక్షతన ఏర్పాటు చేసిన జిల్లా పదాధికారుల సమావేశం ఏర్పాటు చేయటం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన బీజేపీ జిల్లా ఇంచార్జి విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ, సర్పంచ్ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి బీజేపీ కార్యకర్త శక్తి వంచన లేకుండా పని చేయాలని అన్నారు. కామారెడ్డి బీసి డిక్లరేషన్ చేసి బీసి లను 42 శాతం రిజర్వేషన్ ఇస్తాం అని మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి కామారెడ్డి ప్రజలు స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారని అన్నారు. భారతీయ జనతా పార్టీ తరుపున బీసి లకు 50 శాతం బలపరిచామని అన్నారు. అబద్ధపు 420 హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మడం లేదని అన్నారు. జిల్లా లోని అన్ని మండలాల పరిధిలో బీజేపీ తరుపున సర్పంచ్, వార్డు సభ్యులకి అభ్యర్థులను నిలిపామని మెజారిటీ స్థానాల్లో బీజేపీ గెలుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
