పంచాయితీ ఎన్నికలు పారదర్శకంగా, ప్రశాంతంగా జరగడానికి మైక్రో అబ్జర్వర్‌ల పాత్ర అత్యంత కీలకం

WhatsApp Image 2025-12-08 at 5.58.29 PM

కామారెడ్డి జిల్లా : 

Read More మొదటి విడత ఎన్నికల ప్రచార గడువు ముగింపు...

గ్రామ పంచాయితీ ఎన్నికల నిర్వహణలో భాగంగా మైక్రో అబ్జర్వర్‌ లకు శిక్షణ కార్యక్రమం సోమవారం  కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించబడింది.
 
ఈ శిక్షణ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్  ఆశిష్ సాంగ్వాన్ , సాధారణ పరిశీలకులు సత్యనారాయణ రెడ్డి హాజరై సూచనలు అందించారు. అబ్జర్వర్‌ల బాధ్యతలు, ఎన్నికల నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనుసరించాల్సిన నిబంధనలపై వివరణాత్మకంగా మార్గనిర్దేశం చేశారు.

Read More నేటి భారతం :

కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మాట్లాడుతూ, గ్రామ పంచాయితీ ఎన్నికలు పారదర్శకంగా, ప్రశాంతంగా జరగడానికి మైక్రో అబ్జర్వర్‌ల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాల్లో జరుగుతున్న ప్రతి కార్యకలాపాన్ని జాగ్రత్తగా పర్యవేక్షించి, ఎలాంటి లోపాలు కనిపించిన వెంటనే సంబంధిత అధికారులకు నివేదించాల్సిన అవసరాన్ని ఆయన వివరించారు.

Read More మల్లారెడ్డిపల్లి గ్రామానికి సేవ చేస్తా ఆశీర్వదించండి.

సాధారణ పరిశీలకులు సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల విధానాలు, పోలింగ్ ప్రక్రియ, ఎలక్టోరల్ రూల్స్, మోడల్ కోడ్ ఆఫ్ కన్డక్ట్ పాటించడం వంటి అంశాలపై వివరించారు. ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి ప్రతి అబ్జర్వర్ బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆయన సూచించారు. శిక్షణ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ విభాగాల నుంచి ఎంపికైన మైక్రో అబ్జర్వర్‌లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మదన్ మోహన్, డిపిఓ మురళీ, డిపిఎల్ఓ శ్రీనివాస్, , తదితరులు పాల్గొన్నారు. 

Read More మొదటి దశ లో ఏకగ్రీవ స్థానాలు, ఉప సర్పంచ్ ఎన్నికల ఫలితాల ప్రకటన

About The Author