కలెక్టరేట్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో రెండవ విడతలో మూడవ ర్యాండమైజేషన్ పూర్తి

WhatsApp Image 2025-12-12 at 4.54.53 PM

కామారెడ్డి : 
రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా  మూడవ ర్యాండమైజేషన్  కలెక్టరేట్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో  శుక్రవారం జిల్లా పాలనాధికారి ఆశిష్ సాంగ్వాన్, సాధారణ పరిశీలకులు సత్యనారాయణ రెడ్డి సమక్షంలో నిర్వహించారు.

ఈ సందర్భంగా రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించే ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని నాలుగు మండలాలు లింగం పేట, నాగిరెడ్డిపేట, గాంధారి, ఎల్లారెడ్డి, బాన్సువాడ నియోజక వర్గంలోని మహ్మద్ నగర్, నిజాంసాగర్, పిట్లం 3 మండలాలు మొత్తం 7 మండలాల్లో పోలింగ్ సిబ్బంది యెుక్క మూడవ విడత ర్యాండమైజేషన్  ప్రక్రియను జిల్లా కలెక్టర్, జనరల్ అబ్సర్వర్ సమక్షంలో నిర్వహించారు. ఈ సమావేశంలో  అదనపు కలెక్టర్ మధుమోహన్, సిపిఓ, రఘునందన్, ఎస్.ఓ శివకుమార్, జిల్లా పంచాయతీ అధికారి, కంప్యూటర్ ఆపరేటర్లు, తదితరులు పాల్గోన్నారు.

About The Author