మొదటి దశ గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకూడదు..
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యూరో :
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో భాగంగా జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ, జిల్లాలో ఆరు మండలాల్లో 120 గ్రామ పంచాయతీ స్థనాలకు మొదటి దశ ఎన్నికలు జరగనున్నాయని తెలిపారు. సూక్ష్మ పరిశీలకులు, పిఓ, ఓపిఓ, ఇతర అధికారులను అవసరానికి అదనంగా నియమించుకోవడంతో పాటు, వారికి శిక్షణా కార్యక్రమాలు నిర్వహించామని వివరించారు. సరిపడినంత పోలింగ్ సామాగ్రి అందుబాటులో ఉందని పేర్కొన్నారు. ఎన్నికల సామాగ్రి పంపిణీకి పటిష్ట ఏర్పాట్లు చేశామని తెలిపారు. జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయితీ ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా, పకడ్బందిగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
గ్రామ పంచాయతీ ఎన్నికల జిల్లా సాధారణ పరిశీలకులు ఆయేషా మస్రత్ ఖానం మాట్లాడుతూ, మొదటి విడత గ్రామ పంచాయితీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని తెలిపారు. ఇప్పటికే దాదాపు ఓటరు స్లిప్ ల పంపిణీని పూర్తి చేశామని అన్నారు. ఎన్నికల ప్రక్రియను వెబ్ కాస్టింగ్ చేసేందుకు తగిన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు.
జిల్లా ఎస్పీ జానకి షర్మిల మాట్లాడుతూ, మొదటి దశ గ్రామ పంచాయితీ ఎన్నికలకు పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, ఏఎస్పీ ఉపేంద్రా రెడ్డి, ఆర్డీవో రత్నకళ్యాణి, డిపిఓ శ్రీనివాస్, డీఈఓ భోజన్న, జెడ్పీ సీఈవో శంకర్, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
About The Author
11 Dec 2025
