మాజీ సీఎం రోశయ్యకు ఘన నివాళి

సంగారెడ్డి :
:
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొనిజేటి రోశయ్య 4వ వర్ధంతి దినోత్సవాన్ని సంగారెడ్డి మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ రోశయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోశయ్య అందించిన సేవలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సభ ఉపాధ్యక్షుడు తోపాజీ అనంత కిషన్, ఆర్యవైశ్య సంఘం పట్టణ అధ్యక్షుడు విద్యాసాగర్, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, డిప్యూటీ ఈ ఈ ఆర్ బి రవీందర్ రెడ్డి, రాధా కిషన్, భాస్కర్, వెంకటేశ్వరరావు, శ్రీనివాస్,రవీందర్ చంద్రిక కరుణాకరన్, కన్నయ్య మనోహర్, ప్రసాద్, చంద్రశేఖర్ ఉమాపతి తదితరులు పాల్గొన్నారు.
About The Author
06 Dec 2025
