మొదటి దశ లో ఏకగ్రీవ స్థానాలు, ఉప సర్పంచ్ ఎన్నికల ఫలితాల ప్రకటన

- ఏకగ్రీవ సర్పంచ్..  
- దశలవారీగా వార్డుల వారీగా.. 
- ప్రత్యేక పర్యవేక్షణ సెల్ నుండి నివేదికల స్వీకరణ.. 
- నామినేషన్ల పై ఇప్పటివరకు అందిన ఫిర్యాదులు...  
- తీసుకున్న చర్యల నివేదికలు.. 
- ఎమ్ సి సి ఫిర్యాదులు..   పరిష్కారము.. 

WhatsApp Image 2025-12-05 at 6.38.39 PM

కామారెడ్డి జిల్లా : 
బ్యాలెట్ పత్రాలు, సర్వీస్ ఓటర్లు, ఓటరు సౌకర్యాల కేంద్రం పలు ఎజెండా అంశాల పై జిల్లాలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సమగ్ర సమీక్ష  జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్  మినీ సమావేశ మందిరంలో సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

Read More గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియను లోటుపాట్లు లేకుండా పూర్తి చేయాలి జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్.

ఈ సమావేశంలో మొదటి దశలో ఏకగ్రీవ సర్పంచ్, ఉప సర్పంచ్ స్థానాలు, వార్డుల వివరాలను, ప్రత్యేక పర్యవేక్షణ సెల్ నుండి అందిన నివేదికలను సమీక్షించి, ఇప్పటివరకు నామినేషన్లపై వచ్చిన ఫిర్యాదులు, వాటిపై తీసుకున్న చర్యల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

Read More రెండు లక్షల 50 వేల రూపాయల ఎల్ఓసిని అందజేసిన ఎమ్మెల్యే జిఎంఆర్

ఎన్నికల నియమావళి (ఎమ్ సి సి) ఉల్లంఘనలకు సంబంధించిన ఫిర్యాదులు 7 వచ్చాయని,  అలాగే బ్యాలెట్ పత్రాలు, సర్వీస్ ఓటర్లు, ఓటరు సౌకర్యాల కేంద్రాల ఏర్పాట్లు ప్రతీ మండలంలో ఎంపిడిఓ కార్యాలయంలో  ఏర్పాట్లు చేయాలని, ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు, తదితరులు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు  విడతల వారీగా  తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలిపారు.  ఈ సందర్భంగా ఎన్నికల పారదర్శకత, నిబంధనల అమలు, సమయానుసార చర్యలు తీసుకోవడం వంటి అంశాలపై  కలెక్టర్ కీలక సూచనలు చేశారు.ఈ సమీక్షలో  అదనపు కలెక్టర్లు విక్టర్, మదన్ మోహన్, సీఈవో చందర్, ఆర్ డి ఓ వీణ, డిపిఓ మురళీ, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు. 

Read More నిర్ణీత గడువులోగా అభివృద్ధి పనులను పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్

About The Author