కాంగ్రెస్ లో చేరిన ఉటూరు బీఆర్ఎస్ నేతలు

ప్రజాపాలనపై నమ్మకంతో పార్టీలోకి వచ్చారన్న ఎమ్మెల్యే కవ్వంపెల్లి

WhatsApp Image 2025-12-04 at 4.54.26 PM

కరీంనగర్ : 

Read More ర్యాండమైజేషన్ విధానంలో ఎన్నికల సిబ్బందికి కేటాయింపు

కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా పాలనపై నమ్మకంతోనే బి ఆర్ ఎస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు పార్టీలోకి వస్తున్నారని మనకొండూరు ఎమ్మెల్యే డాక్టర్  కవ్వంపెల్లి సత్యనారాయణ స్పష్టం చేశారు. గురువారం మానకొండూర్ మండలం ఉటూరు గ్రామానికి చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు ఎల్ఎండీ కాలనీలోని  ప్రజాభవన్ లో ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పార్టీ కండువాలు కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు.

Read More పంచాయితీ ఎన్నికల్లో గంపగుత్త బేరాలు..!

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో సభ్యులవడం సంతోషంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి తిరోగమన దిశగా సాగిందని, అవినీతి, అక్రమాలతో రాష్ట్ర ఖజానాకు తూట్లు పొడిచారని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ పాలనకు చరమగీతం పాడారని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక పాలనను గాడీలో పెట్టిందన్నారు. ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూనే రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడుపుతున్నదన్నారు. అన్ని రంగాలను అభివృద్ధి పర్చాలనే ఉద్దేశంతో ముందుకు సాగుతూ పారదర్శక పాలన అందిస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీ చేసేదే చెబుతుందని, చెప్పేదే చేస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యంతోపాటు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నదని, ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న కొత్త రేషన్ కార్డులను కాంగ్రెస్ ప్రభుత్వం పంపిణీ చేయడమే కాకుండా రేషన్ కార్డులపై దొడ్డు బియ్యానికి బదులుగా సన్న బియ్యం సరఫరా చేస్తున్నదని ఆయన చెప్పారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో గూడు లేని నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కలగా మారగా, కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను ఇస్తూ వారి సొంతింటి కలను సాకారం చేస్తున్నదన్నారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇళ్లు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి తెలిపారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని ఆయన కోరారు. గ్రామ అభివృద్ధిలో పంచాయతీ ఎన్నికలు కీలకమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. సర్పంచులుగా కాంగ్రెస్ మద్దతుదారులను గెలిపించేందుకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలన్నారు. మనోళ్లను గెలిపించుకోవడం ద్వారా ప్రభుత్వం నుంచి ఎక్కువ నిధులు మంజూరు చేయించుకోవడానికి అవకాశాలుంటాయన్నారు. అంతే కాకుండా ఎమ్మెల్యేగా తన సహకారం ఎలాగూ ఉంటుందన్నారు. 

Read More నామినేషన్ ప్రక్రియలో పొరపాట్లు జరగకుండా చూడాలి

కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకున్న వారిలో ఎనగందుల మల్లయ్య, బక్కయ్య, శంకర్, రాజు, కల్వల అంజయ్య, బొల్లం సంధ్య, కె.అంజయ్య, జినుక అఁజయ్య, అంతడ్పుల అనిల్,సాగర్, ఎనగందుల శ్రీకాంత్, విజయ్, మహేశ్, శివనాథ్, ఆర్.నరేష్, కె.నరేష్, రాజేశ్, హన్మంతు, రమేశ్, శ్రీనివాస్, అరవింద్, శ్రీనివాస్, చందు, సంపత్, వెంకటేష్ అంజి, రంగయ్య, రాజేందర్, వంశీ, దాసరి ఆదిత్య, కె.నర్సింహారెడ్డి, చంద్రయ్య, మఝు. నీరటి సంపత్, రామడుగు రమేశ్, పుట్ట తిరుపతి తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఊటూరు గ్రామశాఖ అధ్యక్షుడు బొంగోని సునిల్ గౌడ్, పార్టీ నాయకులు గోపు శ్రీనివాస్ రెడ్డి, రేమిడి శ్రీనివాస్ రెడ్డి, ఆ గ్రామ సర్పంచ్ అభ్యర్థి వెలిశెట్టి కళ్యాణి-కిశోర్ తదితరులు  పాల్గొన్నారు. 

Read More అంతర్జాతీయ మహిళలపై హింస నిర్మూలన దినోత్సవం

About The Author