తాండూర్ అస్తిత్వాన్ని కాపాడుకోవాలి – బీజేపీ పట్టణ అధ్యక్షులు నాగారం మల్లేశం
- కొడంగల్ మెడికల్ కాలేజీ పేరుతో జిల్లా ఆస్పత్రి నిర్వహణ ఏమిటి?
- తాండూర్‌కే ప్రత్యేక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలి డిమాండ్
- జిల్లా ఆస్పత్రి, మాతా-శిశు కేంద్రాన్ని సందర్శించిన బీజేపీ నాయకులు
- తాండూర్ హక్కుల కోసం ప్రజలందరినీ ఏకం చేస్తాం
తాండూరు:
తాండూర్ పట్టణ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ ఐక్యంగా ముందుకు రావాల్సిన అవసరం ఉందని బీజేపీ పట్టణ అధ్యక్షులు నాగారం మల్లేశం అన్నారు. మంగళవారం ఆయన ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు తాండూర్ జిల్లా ఆస్పత్రి, అలగే మాతా-శిశు కేంద్రాన్ని సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు.
ఈ సందర్భంగా నాగారం మల్లేశం, కృష్ణ ముదిరాజ్ మాట్లాడుతూ..., కొడంగల్ మెడికల్ కాలేజీ పేరుతో తాండూర్ జిల్లా ఆస్పత్రిలో మార్పులు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న వైద్యులు, నర్సులను బదిలీ చేస్తూ, వారి స్థానంలో మెడికల్ కాలేజీ సిబ్బందిని నియమిస్తున్నారని ఆరోపించారు. అలాగే జనన, మరణ ధ్రువపత్రాలపై కూడా కొడంగల్ మెడికల్ కాలేజీ పేరు నమోదు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు.
తాండూర్‌లో అన్ని వసతులు, మౌలిక సదుపాయాలు ఉన్నప్పటికీ వాటిని ఇతర ప్రాంతాలకు మళ్లించడం సమంజసం కాదన్నారు. తాండూర్ ప్రజాప్రతినిధులు, ప్రజలు, వివిధ రాజకీయ పార్టీలు, సామాజిక సంఘాల నాయకులు అందరూ కలిసి తాండూర్‌కే ప్రత్యేక మెడికల్ కాలేజీ సాధించుకునే దిశగా ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ ముదిరాజ్, జిల్లా కార్యదర్శి బంటారం భద్రేశ్వర్, 23వ వార్డు కౌన్సిలర్ అంతారం కిరణ్ కుమార్, సీనియర్ నాయకుడు మోత్కుపల్లి చంద్రశేఖర్, పట్టణ ఉపాధ్యక్షుడు దోమ కృష్ణ, చిదిరి ప్రకాష్, ప్రహ్లాద్ జాదవ్, జిల్లా ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షుడు బండారు శ్రీకాంత్, పట్టణ ప్రధాన కార్యదర్శి మంతటి రాజు, ప్రభాకర్ గౌడ్, బబ్లు, సాయిలు, రాజు, భీమేష్ చారి తదితరులు పాల్గొన్నారు.
