
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యూరో :
నిర్మల్ ఇటుక బట్టీలో గత సోమవారం ఇటుకను ట్రాక్టర్ నుండి దింపి తిరిగి ఇటుక బట్టి వస్తుండగా ఒక మహిళా కార్మికురాలు మృతి చెందిన ఘటనను పురస్కరించుకొని నిజానిధారణ కోసం ఇటుకబట్టిని సందర్శించడం జరిగింది. సదరు మహిళ భర్త ట్రాక్టర్ను నిర్లక్షంగా నడుపుతుండగా ప్రమాదవశాత్తు భానుమతి (30) పడి అక్కడికక్కడే మృతి చెందింది.
ఆ మృతదేహాన్ని నిర్మల్ జిల్లాలోని పోస్టుమార్టం అనంతరం దహన సంస్కారాలు ఇక్కడే చేయడం జరిగింది ఆమె భర్త జగమంద్ ఒక్కడే ఉన్నాడు. ఇట్టి ఇటుక బట్టీలో అనేక మంది 14 ఏళ్ల లోపు బాలలు కార్మికులు పనిచేస్తూ ఉండడం గమనించి, జిల్లా చైల్డ్ హెల్ప్ లైన్ కు కాల్ చేసి సమాచారం అందించారు, అలాగే పని ప్రదేశంలో కార్మికులకు సరైన గృహ వసతి, కార్మికులకు ఎలాంటి రక్షణ లేదు, చిన్న పిల్లలకు, గర్భినిలకు అంగన్వాడి, ఏ ఎన్ ఎమ్ ద్వారా ఎలాంటి పోషకాహారం, మందులు అందడం లేదు, కార్మికులకు వెయ్యి ఇటుకలకు గాను 500 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారు, కనీస వేతనాలు బ్యాంకు ద్వారా చెల్లించడం లేదు, కాబట్టి కార్మిక శాఖ అధికారులు తక్షణం జిల్లాలోని అన్ని ఇటుక బట్టీలను స్పెషల్ డ్రైవ్ కింద ఇన్స్పెక్షన్ చేసి ఒడిశా, మహారాష్ట్ర వలస కార్మికులకు కనీస వసతులు కలిపించి, వారి హక్కులను కాపాడవలసిందిగా కోరారు. మృతుని కుటుంబానికి తక్షణమే మృతధనం సహాయం, చట్టపరంగా అందించేలా తగు చర్యలు తీసుకోవాలని అధికారులను డిమాండ్ చేశారు.
బట్టి యజమాని శేషాద్రి, వెంకట్ రెడ్డిలను కలిసి యూనియన్ నాయకులు సయ్యిద్ ఇల్యాస్ వివరాలు సేకరించి నివేదిక ప్రభుత్వానికి ఇవ్వనున్నారు.