సిక్కుల సంక్షేమానికి అండగా ఉంటాం
- టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి

సంగారెడ్డి :
:
సిక్కుల సంక్షేమానికి అన్ని విధాల అండగా ఉంటామని టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి హామీ ఇచ్చారు. గురువారం సంగారెడ్డి పట్టణంలోని గురుద్వారాను గురు నానక్ జయంతి సందర్భంగా ర్యాలీ లో పాల్గొని సందర్శించారు. ఈ సందర్భంగా సిక్కు మతస్తులతో కలిసి డోలక్ వాయిస్తూ భజనలో పాల్గొన్నారు. అనంతరం జగ్గారెడ్డి మాట్లాడుతూ... గురుద్వారా కి వెళ్లే దారిలో కమాన్ ఏర్పాటు చేయడమే కాకుండా సర్దార్ల కోరిక మేరకు ప్రత్యేక కమ్యూనిటీ హాల్ ని కూడా ఏర్పాటు చేయిస్తానని అందుకు సంబంధించిన డిజైన్ రెడీ చేసుకోవాలని జగ్గారెడ్డి సర్దార్లకు సూచించారు. సిక్కుల సంక్షేమానికి అన్ని విధాల అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డిని సిక్కు మతస్తులు సర్దార్లు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో గురుద్వారా ప్రతినిధులు సిక్కు సర్దార్లు తదితరులు పాల్గొన్నారు.
