నగునూరులో అన్నపూర్ణ గోపినీ సర్పంచ్ గా గెలిపించండి
కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు

కరీంనగర్ :
సర్పంచ్ ఎన్నికల్లో నగునూరు లో అన్నపూర్ణ గోపిని సర్పంచ్ గా భారీ మెజార్టీతో గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం గ్రామపంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ రూరల్ మండలం నగునూరు గ్రామ సర్పంచ్ గా పోటీ చేస్తున్న నర్సింగోజు అన్నపూర్ణ గోపికి మద్దతుగా వెలిచాల రాజేందర్ రావు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్నూరు కాపు సంఘం, రెడ్డి సంఘం ఆత్మీయ సమావేశాల్లో పాల్గొన్నారు.. నగునూరు సర్పంచ్ గా పోటీ చేస్తున్న అన్నపూర్ణ కు ఓటు వేసి గెలిపించాలని రాజేంద్ర రావు కోరారు. మున్నూరు కాపు సంఘం రెడ్డి సంఘం ప్రతినిధులు ముందుకు వచ్చి భారీ మెజారిటీతో గెలిపిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వారికి రాజేందర్రావు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ అభ్యర్థులను సర్పంచులుగా గెలిపించడం ద్వారా గ్రామాలు మరింత అభివృద్ధి చెందుతాయని రాజేందర్రావు పేర్కొన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలనీ, అభివృద్ధిని అడ్డుకునే వారిని ఓడించాలని కోరారు. అన్నపూర్ణ గోపిని గెలిపిస్తే నగునూరును అత్యుత్తమ గ్రామపంచాయతీ గా తీర్చిదిద్దుతామనీ, అందుకు గ్రామ ప్రజలు అవకాశం ఇవ్వాలని రాజేందర్ రావ్ కోరారు. కరీంనగర్ రూరల్ మండలం ఎలబోతారం గ్రామానికి చెందిన స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థి ఎ. రమేష్ కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఇంచార్జి వెలిచాల రాజేందర్ ఆధ్వర్యంలో పార్టీ లో చేరారు.
