నూతన సిఐని కలిసిన బిఆర్ఎస్ యువ నాయకులు

సంగారెడ్డి :
సంగారెడ్డిలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సర్కిల్ ఇన్స్పెక్టర్ రాము నాయుడు ను సంగారెడ్డి బీఆర్ఎస్ యువ నాయకులు శ్రవణ్ రెడ్డి ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఐకు పూలగుచ్ఛం అందించి, శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.నియోజకవర్గంలోని శాంతి భద్రతా పరిరక్షణకు పోలీసులు చేస్తున్న సేవలను అభినందించారు. ప్రజా సమస్యల పరిష్కారంపై సంక్షిప్తంగా చర్చించిన నాయకులు, నూతన సీఐ నాయకత్వంలో చట్టం-శాంతి నిర్వహణ మరింత బలోపేతం అవుతుందనే నమ్మకం వ్యక్తం చేశారు.సీఐ ను కలసిన వారిలో వాజీద్, దిలీప్ కరీముద్దీన్, అదనాన్, సాబీల్ తదితరులు ఉన్నారు.
About The Author
03 Mar 2026
